Akhil Akkineni: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని కుటుంబం నుండి నాగేశ్వరరావు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున, నాగచైతన్య అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం అక్కినేని అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కినేని వారసత్వం గురించి అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం అఖిల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన చిత్రం ‘ ఏజెంట్’. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన వీక్షకుల ముందుకి రాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
సినిమా ప్రమోషన్స్ పనులతో అఖిల్ బిజీగా ఉన్నాడు. వరుస ఇంటర్వ్యులు, ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ అక్కినేని వారసత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ..” వారసుడిగా కంటే, అఖిల్ గానే ఉండటానికి ట్రై చేస్తాను. ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకుంటే నాకు సంతోషం.
Akhil Akkineni: అక్కినేని వారసుడు కంటే అఖిల్ గా ఉండటమే ఇష్టం…
అక్కినేని వారసత్వం గురించి ఆలోచిస్తే అందులోకి వెళ్లిపోతాను. ప్రస్తుతం సినిమాల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. సక్సెస్ లు వచ్చినా, ఫెయిల్యూర్ అయినా చివరి దాకా నాలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను” అని అఖిల్ చెప్పుకొచ్చాడు . ప్రస్తుతం అఖిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఏజెంట్ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాని షేర్ చేస్తు సినిమా మీద అంచనాలు పెంచుతోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…