Movie News

దృశ్యం2′ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా అక్కడ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మంచి కథా బలంతో ఎంతో ఆసక్తిగా కొనసాగే స్క్రీన్ ప్లే తో కొనసాగే ఈ సినిమా విమర్శలకుల ప్రశంసలు అందుకుంది.. కేవలం మలయాళం లోనే కాదు అన్ని భాషల్లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదే పేరుతో తెలుగులో విక్టరీ వెంటేష్ హీరోగా ఈ సినిమా రీమేక్ అయ్యి మంచి విజయాన్నిసొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం2 వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీశాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేశారు.అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కొద్దీ రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ ఊపందుకుంది. దాంతో సురేశ్ బాబు స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తామే స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేశారు.విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో సీనియర్ హీరో వెంకటేష్ ఎప్పుడు ముందుంటారు.

మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నటిస్తున్నారు వెంకీ. ఇక త్వరలో నారప్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు ఎఫ్ 3, దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు వెంకీ. సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. వీటిలో దృశ్యం 2 సినిమాను F3 సినిమా కంటే ముందుగా పూర్తి చేసి విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సంగీత హక్కుల వివాదం: ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…

30 minutes ago

వనస్థలిపురంలో భయంకర ఘటన.. మాజీ భర్త చేతిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…

45 minutes ago

గోల్డెన్ అవర్‌లో ఉచిత చికిత్స.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం భారీ భరోసా!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

1 hour ago

బంగాళాఖాతంలో లో ప్రెషర్.. ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…

1 hour ago

ఒక మిస్డ్ కాల్‌తోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఈ నెంబర్ వెంటనే సేవ్ చేసుకోండి!

ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…

2 hours ago

నిల్వలోనే పాడైపోతున్న పప్పులు? ఇలా చేస్తే పురుగులు దరిచేరవు!

ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…

2 hours ago