Producer Tammareddy Bhardwaja : నిత్యం ఇండస్ట్రీలోని ఏదైనా సమస్య గురించి లేదా జరుగుతున్న పరిణామాలను గురించి తన ఆలోచనలను అలాగే అభిప్రాయాలని ముక్కుసూటిగా చెప్పే సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు గతంలో పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి మీద మాట్లాడటం పెద్ధ చర్చకు దారితిసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనను టార్గెట్ చేసి బాగా ట్రోల్ చేయడం వంటివి చేశారు. అలాగే త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గొడవలో కూడా తమ్మారెడ్డి మాటలకు చాలా మంది కామెంట్స్ చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అయన వీటి గురించి మాట్లాడారు.
మీ ఇంట్లో ఆడవాళ్లను కాపాడుకోలేరు…
సినిమా ఇండస్ట్రీలో పట్టించుకోవాల్సిన అంశాల గురించి ఎవరూ మాట్లాడకపోయినా నేను పవన్ కళ్యాణ్ ను విమర్శించిన వెంటనే జనసేన కార్యకర్తల పేరుతో కొంతమంది నా మీద విరుచుకుపడ్డారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో కూడా నా మీద బాగా విమర్శలను చేసారు. వీటి వల్ల నాకేమీ పోదు ఇంకా సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుందంతే అంటూ మాట్లాడారు. అయినా నామీద ఆవేశపడేవాళ్లంతా ముందు ఏమయ్యారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సినిమా ఇండస్ట్రీ ఆడవాళ్లంతా చెడిపోయిన వాళ్ళు అని కామెంట్స్ చేస్తే ఒక్కడు కూడా ఆరోజు వాళ్ళను ఏమీ అనలేదు.
అపుడు కూడా నేను మాత్రమే మాట్లాడాను. నన్ను విమర్శించిన వాళ్లంతా అపుడు ఏమయ్యారు. వాళ్ళ మగతనం ఏమైంది అపుడు, వాళ్ళు మగాళ్లు కారా అంటూ విమర్శించారు. ఇక రీసెంట్ గా కూడా ఒక రాజకీయ నాయకుడు ఇండస్ట్రీ వాళ్ళు దోచుకున్నారు అంటూ మాట్లాడాడు. ఏం దోచుకున్నాం చూపించు అని ఛాలెంజ్ చేశాను. నేను తప్ప ఎవరూ ఇలాంటి విషయాల గురించి మాట్లాడలేదు అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్లంతా ఇపుడేమయ్యారు, మీ ఇంట్లో వాళ్లనే కాపాడుకోలేని వాళ్ళు మీరేం మగాళ్లు అంటూ ఇండస్ట్రీ లోని అందరినీ ఉద్దేశించి మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…