Producer Thammareddy Bhardwaja : నిత్యం ఇండస్ట్రీ లోని ఏదైనా సమస్య గురించి లేదా జరుగుతున్న పరిణామాలను గురించి తన ఆలోచనలను అలాగే అభిప్రాయాలని ముక్కుసూటిగా చెప్పే సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు గతంలో పవన్ కళ్యాణ్ వ్యవహారాశైలి మీద మాట్లాడటం పెద్ధ చర్చకు దారితిసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనను టార్గెట్ చేసి బాగా ట్రోల్ చేయడం వంటివి చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అయన వీటి గురించి మాట్లాడారు.
పవన్ సక్కగా ఉంటే ఫ్యాన్స్ సక్కగవుతారు….
తమ్మారెడ్డి గారు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ తో కలిసి తిరగాలని భావిస్తున్నాడు. అయితే ఆయన జనసైనికులు మాత్రం ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉంది అంటూ చెబుతున్నారు. మరీ పవన్ తన అనుచరులతో మాటలనే విబేదిస్తున్నట్లు భావించాలా అంటూ ప్రశ్నించారు. ఇక ఆయన మాటల గురించి వివరణ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన భార్యతో ఇంట్లో మాట్లాడిన మాటలకు నేను దూరి విమర్శించలేదు. ఆయన రాజకీయాలా గురించి మాత్రమే నేను మాట్లాడాను.
ఆ హక్కు నాకు ఉంది. నాకే కాదు ఎవరికైనా ఉంటుంది. స్థాయిల గురించి పవన్ అభిమానులు మాట్లాడుతున్నారు. ఇండియాలో అందరి స్థాయి ఒకటే. ప్రధాని అయిన కామన్ మ్యాన్ అయిన ఒకటే స్థాయి ఉంటుంది. అయిన పవన్ ను విమర్శిస్తే ఆయన మాట్లాడరు ఆయన పేరు చెప్పుకునే కొంతమంది జనసైనికులు వస్తారు. దానివల్ల నాకేమి నష్టం జరగదు ఇంకా నాపేరు సోషల్ మీడియలో వైరల్ అవుతుంది అంటూ తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…