Production Manager Deepthi : ఏ రంగంలో అయినా ఆడవాళ్లు రానించాలంటే కస్టపడాలి. ఆడదానివి నువ్వేం చేస్తావ్ అనే చులకన భావన నుండి ఆడ అయినా మగ అయినా సమానమే అనే ధోరణి కొంతవరకు సమాజంలో కనిపిస్తున్నా ఇప్పటికీ ఇంకా కొన్నిచోట్ల ఆడవాళ్లకు వ్యతిరేకత, చిన్నచూపు ఎదురవ్వుతూ ఉన్నాయి. అలా సినిమా రంగంలో లేడీ ప్రొడక్షన్ లైన్ మేనేజర్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ధ ప్రాజెక్ట్స్ అందుకుంటున్న వ్యక్తి దీప్తి గారు. ఇప్పటికే తలైవి, పొన్నియన్ సెల్వన్, వినయ విధేయ రామ వంటి సినిమాలకు పనిచేసిన ఆమె ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో అవకాశం కోల్పోయినందుకు బాధపడ్డాను అంటూ చెబుతున్నారు.
రామ్ చరణ్ తో సెల్ఫీ అడిగితే…
దీప్తి గారు మొదట్లో ఇండస్ట్రీలో చిన్నచూపు, చీత్కారాలు ఎదుర్కొన్నా చివరకు లైన్స్ మేనేజర్ గా పెద్ధ ప్రాజెక్ట్స్ కి పనిచేసారు. ఎటువంటి సినిమా నేపధ్యం కానీ రిఫరెన్స్ కానీ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కష్టపడ్డారు. వర్కింగ్ యూనియన్ లో మెంబెర్ గా చేరి ప్రొడ్యూసర్ల ఇమెయిల్ ఐడి లను సేకరించి పని ఇవ్వమని అడిగేవారట. అలా మొదలైన ప్రయాణంలో ‘వినయ విధేయ రామ’ లాంటి పెద్ధ ప్రొజెక్ట్ చేసానని చెప్పారు. ఆ సినిమా ప్రమోషన్స్ అపుడు రామ్ చరణ్ గారితో ఒక ఫోటో తీసుకోవాలని వెళితే మరోవ్యక్తి తనను లైన్ మేనేజర్ అని పరిచయం చేసి మీమీదకి ఎవరు రాకుండా ఒంటి చేత్తో ఆపింది ఈవిడే అంటూ పరిచయం చేసారు.
వెంటనే రామ్ చరణ్ గారు లేడీ మేనేజర్స్ రావడం చాలా బాగుంది. మీలాగా ఎంతో మంది ఇంకా ఇండస్ట్రీకి ఆడవాళ్లు రవాలి పనిచేసి పేరు తెచ్చుకోవాలి అంటూ ప్రశంసించడం మరచిపోలేను అంటూ చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ధ సినిమాకు పనిచేసే అవకాశం మొదట వచ్చినా ఆ తరువాత దానయ్య గారిని వెళ్లి కలిస్తే వేరే వాళ్లకు ఇచ్చేసాం నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పినపుడు చాలా బాధగా అనిపించింది. ఆ సినిమా చాలా స్పెషల్. ఇద్దరు మెయిన్ హీరోస్ అందులోనూ రాజమౌళి అందుకే ఆ సినిమా చేజారినప్పుడు బాధపడ్డాను అంటూ చెప్పారు దీప్తి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…