Featured

Pruthvi : పెళ్లి సినిమా నిర్మాతని చెప్పుతో కొడతా అని అన్నాను : యాక్టర్ పృథ్వీ

Pruthvi : సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు. ‘పెళ్లి’ సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసిన పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు. ఇక పెళ్లి తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమీ పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ.

పెళ్లి సినిమా నిర్మాతను చెప్పతో కొడతా అన్నాను…

బబ్లు పృథ్వీగా అప్పటి వరకు అందరికీ తెలిసిన పృథ్వీ పెళ్లి సినిమాతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యారు. వెరైటీగా విలనిజం చూపించిన పృథ్వీ అప్పటి నుండి పెళ్లి పృథ్వీ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తమిళ ఇండస్ట్రీలో ఉన్న పృథ్వీ కి తెలుగులో అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర మీద సీరియల్స్, మరో వైపు గేమ్ షో చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న పృథ్వీ కి పెళ్లి సినిమా నిర్మాత రామలింగేశ్వరావు దగ్గరి నుండి ఫోన్ వచ్చింది.

అయితే అప్పటికే పృథ్వీ స్నేహితుడు ఒకతను మిమిక్రి చేస్తూ పెద్ద డైరెక్టర్లు ఫోన్ చేసినట్లు మాట్లాడి పృథ్వీ ని ఆటపట్టించేవారు. ఇక నిజంగానే నిర్మాత రామలింగేశ్వరావు గారు ఫోన్ చేస్తే తన ఫ్రెండ్స్ కావాలని అలా చేస్తున్నారుసనుకుని పృథ్వీ చెప్పుతో కొడతా ఇలా కాల్ చేశావంటే అని అన్నారట. అయితే రామలింగేశ్వర్రావు గారు నేను నిజంగా నిర్మాత అని చెప్పి టీవీ లో మీ ప్రోగ్రామ్ చూసి మా సినిమాకు మీరైతే కరెక్ట్ అని ఫోన్ చేసానని చెప్పగానే క్షమించమని అడిగి అలా పెళ్లి సినిమాలో అవకాశం పొందారు పృథ్వీ. అయితే అప్పటికే నాజర్ సినిమాలో చేయాల్సి ఉన్నా టీవీ లో చేస్తున్న వ్యక్తి తో సినిమలో హీరోగా కష్టం అని ప్రాజెక్ట్ నుండి తప్పించారట. ఆ తరువాత అదే టీవీ లో పృథ్వీ ని చూసి పెళ్లి సినిమా అవకాశం వచ్చింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago