Pruthvi : సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం ‘పెళ్లి’ సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. ఇక సినిమా షూటింగ్ లో తనకు జరిగిన అనుభవాలు అలాగే సినిమా ఇండస్ట్రీలో తనకు గాడ్ ఫాదర్ ఎవరు అనే విషయాన్ని పృథ్వీ గారు పంచుకున్నారు.
ఆ రోజు చనిపోయానని అనుకున్నాను…
పెళ్లి సినిమా తరువాత వారుస అవకాశాలు వస్తాయని అనుకుంటే ఒక్క అవకాశం కూడా రాకపోయే సరికి ఈ సినిమా పోయిందని అనుకున్నాను. అయితే అందరూ ఫోన్ చేసి సినిమా మీ వల్లే హిట్ అయింది అంటుంటే నాకు తెలుగు అర్థం కాక పోయింది అనుకున్నాను. ఇక మూడు నెలల తరువాత వరుస అవకాశాలు రావడంతో అపుడు అర్థమైంది సినిమా పెద్ద హిట్ అయింది అని. ఇక ఒక నెల రోజుల్లో దాదాపు 200 సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇక అలా వచ్చిన ‘ప్రేమించాను నిన్నే’ అనే సినిమా చేయగా ఆ సినిమా షూటింగ్ లో నీళ్లలోకి అనుకోకుండా పడిపోవడం వల్ల సుడిగుండం లో చిక్కుకున్నాను ఆ సమయంలో చనిపోతానని అనుకున్నాను. ఫైట్ మాస్టర్స్ నన్ను కాపాడి హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ డాక్టర్ చెప్తుంటే అర్థమైంది చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను అని. ఇక అప్పటి నుండి నీళ్ళ వల్ల ఫోబియా వచ్చింది. నీళ్లు చూసినా, సౌండ్ విన్నా కూడా భయం వేస్తుంది. ఇక రోడ్డు క్రాస్ చేయాలన్నా, ఎత్తు లో నిలబడాలన్నా కూడా నాకు భయం అంటూ తనకున్న ఫోబియాలా గురించి చెప్పారు పృథ్వీ.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…