Featured

Ram sathyanarayana : మోహన్ లాల్ లాగా చిరంజీవి చేయలేక పోయాడా… సినిమా బాగున్నా గాడ్ ఫాదర్ కి కలెక్షన్స్ లేవా : నిర్మాత రామ్ సత్యనారాయణ

Ram Sathyanarayana : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజులకు ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ తరువాత వచ్చిన ‘సైరా’ అంతగా ఆకట్టుకోలేదు, ఇక ఈ మధ్య వచ్చిన ‘ఆచార్య’ ఏకంగా చిరుని భయపెట్టేసింది. రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక ఆచార్య ఫలితంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా మీద గంపెడు ఆశలతో ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమా మోహన్ లాల్ నటించిన మలయాళం సినిమా లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కనుకగా అక్టోబర్ 5 న విడుదల అయింది. ఇక సినిమా మీద పాజిటివ్ టాక్ ఉన్నా కలెక్షన్స్ మాత్రం చిరు రేంజ్ కి లేకపోవడం కొంచెం నిరాశ కలిగించే అంశం. ఇక ఈ విషయం మీద నిర్మాత రామ సత్యనారాయణ గారు మాట్లాడారు.

సినిమా బాగుంది… కానీ కలెక్షన్స్ రాలేదు…

రామా సత్యనారాయణ గారు మాట్లడుతూ సినిమా చూసాను ఒక ప్రేక్షకుడిగా సినిమా నచ్చింది. మలయాళ సినిమా కూడా నేను ఇంతకుముందు చూసాను అయితే ఆ సినిమాలో ఏవైతే లోపాలున్నాయో వాటిని సవరిస్తూ ఈ సినిమా డైరెక్టర్ మాలిచాడు. సినిమాలో అన్నీ ఉన్నాయి అయితే చిరు నుండి డాన్స్, కామెడీ కోరుకునే ప్రేక్షకుడికి మాత్రం కాస్త నిరాశ కలిగుతుంది అంతకుమించి ఇంక సినిమాలో లోపలంటూ ఏమీ లేదు. ఒక సగటు ప్రేక్షకుడిగా సినిమా చాలా బాగుంది. అయితే కొంతమంది సోషల్ మీడియా లో పనిగట్టుకుని చిరు నటనను మోహన్ లాల్ నటనతో పోలుస్తున్నారు. మోహన్ లాల్ కి కేరళ లో అభిమానులుండొచ్చు ఇక్కడ ఉన్నారంటే నవ్వొస్తోంది. ఇక ఆయన నటనతో చిరు ను పోల్చడమేంటి అంటూ అన్నారు.

ఇక సినిమా బాగున్నా కలెక్షన్స్ విషయంలో ఇంకా పుంజుకోవాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు. అయితే ఆచార్య ఫలితం తరువాత డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉదేశంతో సినిమాను సొంతంగా విడుదల చేయమని చిరు సలహా ఇచ్చారట. ఇక సినమా దసరా సందర్బంగా విడుదల అవ్వడం వల్ల ఇంకా శనివారం, ఆదివారం వారాంతాలు వస్తాయి కాబట్టి వసూళ్లు పుంజుకుంటాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేసారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా వసూళ్లు నెమ్మదిగా అయినా సరే పుంజుకుంటాయి అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago