Pruthvi raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.
పవన్, చిరంజీవి స్టేటస్ అది…
ప్రస్తుతం జనసేన లో ఉన్న పృథ్వీ వైసీపీ నుండి బయటకు వచ్చాక జనసేన పార్టీనే కరెక్ట్ అని అందులో జాయిన్ అయ్యాను అని చెబుతూ జనాలు పవన్ కళ్యాణ్ సభలకు ఎక్కువగా వస్తున్న విషయాన్ని గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరిదీ సీఎం రేంజ్ అంటూ వారు మాట్లాడితే కోట్ల మంది వినడానికి సిద్ధంగా ఉంటారు అంటూ మాట్లాడారు. తను రాజకీయాల్లోకి వచ్చినా పదవులు గురించి ఆలోచించక పోవడం గురించి మాట్లాడుతూ నేను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు అంటూ మాట్లాడారు.
వైసీపీ పార్టీలో ప్రతిదీ సలహాదారులు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారం మీడియా ముందు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు అంటూ పృథ్వీ విమర్శించారు. చంద్రబాబు అయితే వెన్నుపోటు, పవన్ అయితే మూడు పెళ్లిళ్లు అవి తప్ప మేము ఏమి చేసాము అనే విషయాలను ప్రజలకు మాత్రం చెప్పరు. ఏ నాడు లైవ్ ప్రెస్ మీటింగ్ కానీ మీడియా సమావేశాలు కానీ ఎక్కువగా జగన్ పెట్టరు అంటూ వైసీపీ వారి మీద విమర్శలు చేసారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…