Nagarjuna: తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నాగార్జున గురించి పరిచయం అవసరం లేదు. అయితే నాగార్జున నటి అమలను ప్రేమించి తనని రెండవ వివాహం చేసుకున్నారు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమల వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె మూగజీవాల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపిస్తారో మనకు తెలిసిందే. బ్లూ క్రాస్ సమస్థ ద్వారా ఈమె మూగజీవాలను కాపాడుతూ వాటి సంరక్షణ చేపట్టారు.
ఇకపోతే గతంలో వీధి కుక్కలను చాలా దారుణంగా చంపుతున్న నేపథ్యంలో ఈమె కోర్టులో వేసిన పిటిషన్ వల్ల వీధి కుక్కలను మనుషులు చంపడానికి కూడా వీలు లేకుండా పోయింది.అయితే కొన్ని ప్రాంతాలలో ఈ వీధి కుక్కల కారణంగా చిన్నపిల్లలు సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి.
ఇలా ఒక వీధి కుక్క వల్ల ఇబ్బంది పడినటువంటి ఓ వ్యక్తి జిహెచ్ఎంసి అధికారులను సంప్రదించగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అమల గారు వేసిన పిటిషన్ వల్ల వీధి కుక్కల విషయంలో తామేమి చేయలేమని సమాధానం చెప్పారు. ఇలా జిహెచ్ఎంసి ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి ఈ విధమైనటువంటి సమాధానం రావడంతో ఒక నెటిజన్ నాగార్జునను సూటిగా ప్రశ్నించారు.
మీ భార్య మధ్యతరగతి వాళ్లను వేధిస్తోందని నాగార్జునను ప్రశ్నించారు.వీధి కుక్కలను మీ ఇంటి ముందు ఉంచితే ఆ బాధ తెలుస్తుంది అంటూ ఆదర్శ్ అనే నేటిజన్ నాగార్జునని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అయితే ఈ ట్వీట్ కాస్తసోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఆదర్శ అనే వ్యక్తికి సపోర్ట్ చేయగా మరి కొందరు అమలకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…