Adivi sesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఈయన గూడచారి సినిమాలో నటించే సమయంలో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డతో కలిసి నటించారు.అయితే ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇలా వీరి గురించి వార్తలు రావడంతో శేష్ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తున్నారు.అయితే సుప్రియ కూడా ఇదివరకే వివాహం చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఒంటరిగా జీవితంలో ముందుకు వెళ్తూ అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను కూడా ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారు. అయితే శేష్ సుప్రియ గురించి తరచూ ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి.
అయితే తాజాగా మరోసారి ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అందుకు గల కారణం అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి అడివి శేష్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా శేష్,సుప్రియ పక్క పక్కనే ఉంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో మరోసారి ఈ వార్తలకు బలం చేకూరింది.
ఇలా అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఒకే చోటుచేరి పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే ఈ క్రిస్మస్ వేడుకలకు నాగచైతన్య దూరంగా ఉన్నారు.ఇక నాగ చైతన్య ప్రస్తుతం వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈయన ఎలాంటి ఈవెంట్లలో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…