Jayasudha -Jayarada: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటిమణులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జయసుధ జయప్రద తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లను ఎన్నో ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ కార్యక్రమంలో భాగంగా అవార్డుల గురించి వీరిని ప్రశ్నించారు.
బాలీవుడ్ నటి కంగనా రౌనత్ పట్టుమని పది సినిమాలు కూడా నటించక ముందే ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మరి మీకెందుకు రాలేదు అని బాలయ్య ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు జయసుధ సమాధానం చెబుతూ ఆమెకు అవార్డు వచ్చిందని విషయాన్ని మేము తప్పు పట్టడం లేదు కానీ పది సినిమాలలో నటించిన తనకు పద్మ అవార్డు ఇచ్చారు. కానీ మేము ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ప్రభుత్వం మా సేవలను గుర్తించలేదని సమాధానం చెప్పారు.
ఈ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది సినీ సెలబ్రిటీలకు పూర్తిగా అన్యాయం చేస్తుందని మా పరిస్థితి అటు ఉంచితే గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన లేడీ డైరెక్టర్ విజయనిర్మల సేవలను కూడా ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని సమాధానం చెప్పారు. ఈ విషయం గురించి జయప్రద కూడా స్పందించి తన అభిప్రాయాన్ని చెప్పారు.
ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ అవార్డులు అడిగి తీసుకోవడం మాకు ఇష్టం లేదు…సీనియార్టీని గుర్తించి మమ్మల్ని గౌరవించాలని కోరుకున్నాం అంటూ ఈ సందర్భంగా పద్మ అవార్డుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఈ ఇద్దరు సీనియర్ నటి మనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వీరు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…