Political News

Pulivendula By Elections.. పులివెందులలో ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక.. వైసీపీ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టేనా ?

అమరావతి: గత మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవాలకు పెట్టింది పేరైన పులివెందుల జడ్‌పీటీసీ స్థానం ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో, తొలిసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిజమైన పోటీకి రంగం సిద్ధమైంది.

The by-election in Pulivendula has become prestigious.

ఏకగ్రీవాలకు చరిత్ర

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి వైఎస్ జగన్ వరకు, పులివెందులలో జడ్‌పీటీసీ స్థానాలు ఎప్పుడూ ఏకగ్రీవంగానే దక్కాయి. 1995, 2001, 2006, 2021 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. 2016లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసినా, చివరికి అతడు వైసీపీలో చేరడంతో పోటీ లేకుండా పోయింది. 2021లో వైసీపీ అభ్యర్థి మహేశ్వర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆయన దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ప్రతిష్టాత్మకంగా మారిన పోరు

ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉండటంతో, జగన్‌ కంచుకోటను చేజిక్కించుకోవాలని బలంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు వైసీపీ తమ సొంత గడ్డపై జెండా ఎగరేయాలని కసిగా ఉంది. ఈ ఎన్నికల పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా, టీడీపీకి సుమారు 25% (2,600 ఓట్లు) మాత్రమే ఓటు బ్యాంక్ ఉందని అంచనా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పథకాలతో తాము గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

కుటుంబానికి టికెట్, సిట్టింగ్ స్థానం కోసం ప్రయత్నం

ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున దివంగత మాజీ జడ్‌పీటీసీ మహేశ్వర రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ టికెట్ ఇచ్చినట్లు వైసీపీ చెబుతోంది. సాధారణంగా మరణించిన నేత కుటుంబ సభ్యులు పోటీలో ఉన్నప్పుడు పోటీ పెట్టకూడదనే టీడీపీ విధానానికి భిన్నంగా, ఈసారి టీడీపీ తమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి సతీమణిని అభ్యర్థిగా నిలిపింది.

ఫలితంపై ఉత్కంఠ

ఈ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రికి కానుక ఇవ్వాలని టీడీపీ శ్రేణులు భావిస్తుండగా, సిట్టింగ్ స్థానాన్ని వదులుకోకుండా గెలవాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. జగన్ అడ్డాలో వైసీపీకి షాక్ తగలబోతుందా, లేక టీడీపీకి మరోసారి నిరాశే మిగలబోతుందా అనేది ఆగస్టు 14న తేలనుంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago