శాండిల్ వుడ్ నటుడు పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం తీవ్రమైన ఛాతీ నొప్పితో మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం అనంతరం ఛాతిలో నొప్పిగా ఉండటంతో ఇతని కుటుంబ సభ్యులు విక్రమ్ హాస్పిటల్ కు తరలించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇతని మరణవార్తను వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
కన్నడనాట ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడిగా విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు ఉన్నఫలంగా మృతి చెందారన్న విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు ఎంతో విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన భౌతిక కాయాన్ని కంఠీరవ స్టేడయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. శనివారం అభిమానుల సందర్శనార్థం అతని అంతిమ యాత్ర మొదలవుతుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పునీత్ అంతిమయాత్రకు కర్ణాటక పోలీసులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలను నిర్వహించారు. ఈయన అంతిమయాత్రను ఘనంగా చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
పునీత్ రాజ్ కుమార్ అంతిమయాత్ర తర్వాత తన అంత్యక్రియలు తన తండ్రి సమాధి వద్ద జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేవలం పునీత్ తండ్రి సమాధి మాత్రమే కాకుండా, తన తల్లి పర్వతమ్మ సమాధి కూడా అక్కడే ఉండటం చేత పునీత్ అంత్యక్రియలు కూడా తల్లిదండ్రుల సమాధి వద్ద జరగాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే పునీత్ కు ఇద్దరు కుమార్తెలు అన్న విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…