పునీత్ మరణవార్తతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగిపోయింది.అతని మృతదేహాన్ని చూసేందుకు అభిమానులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. కడసారిగా చూసేందుకు అభిమానులు బారులు తీరుతున్నారు.తమ అభిమాన నటుడు ఇక లేరు అనే వార్త వినగానే గుండెపోటుతో పునీత్ అభిమాని ఒకరు కన్నుమూశారు.
మరి కొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. కంఠీరవ స్టూడియోలో రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.పునీత్‌ను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు. అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.
టాలీవుడ్ నుండి నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నిర్మాత సాయి కొర్రపాటి, ప్రభుదేవా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున సీనియర్ నరేష్, శివ బాలాజీ బెంగుళూరు చేరుకుని పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.తండ్రి రాజ్ కుమార్ ఉన్నప్పటి నుండి ఆ కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది.
పునీత్ పార్థివ దేహాన్ని చూసి బాలయ్య భోరున విలపించారు.పునీత్ అన్న శివ కు ధైర్యం చెప్పారు. ఎప్పుడూ హుందాగా, గంభీరంగా కనబడే బాలయ్య భావోద్వేగంతో కంటతడి పెట్టడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శివన్నకు ధైర్యం చెప్పారు. తారక్ పునీత్ మధ్య మంచి స్నేహబంధం ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…