కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . తమ అభిమాన హీరో ఇక లేరనే వార్తను అటు సినీ పరిశ్రమతోపాటు ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ఉదయం పునీత్ గుండెపోటుతో ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. తమ అభిమాన హీరోను కడసారి చూసుకునేందుకు అభిమానులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి, అక్కడి నుంచి కంఠీరవ స్టేడియంకు తరలించి, అప్పటి నుంచి అభిమానుల సందర్శనార్థం ఇంకా అక్కడే ఉంచారు.
సెలెబ్రిటీలు పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. నేడు సాయంత్రమే పునీత్ అంత్యక్రియలు జరుగుతాయని అనుకున్నారు. కాని తాజాగా అంత్యక్రియల కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. ఈ విషయాన్నీ కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా ప్రకటించారు.
ఆయన కూతురు అమెరికా నుంచి వచ్చాకే అంత్యక్రియలు జరుగుతాయని, ఈరోజు సాయంత్రం 5 గంటలకు పునీత్ కూతురు బెంగుళూరుకు చేరుకుంటుందని అనుకున్నారు. కానీ ఆమె ఇంకా బెంగుళూరుకు చేరుకోకపోవడంతో పునీత్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేశారు. ఇక పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ రేపు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…