పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించడం అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటికీ పునీత్ లేరనే విషయం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ ఉన్నఫలంగా స్పృహ కోల్పోయి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో కన్నడ పవర్ స్టార్ ఇక లేరన్న విషయాన్ని వైద్యులు అధికారికంగా వెల్లడించారు.
ఇలా ఒక్కసారిగా ఆయన మరణవార్త చెప్పడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు. ఇక తాజాగా పునీత్ నటించిన యువరత్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పునీత్ తెలుగు భాష తెలుగు ఇండస్ట్రీతో తనకున్న సంబంధం గురించి బయట పెట్టారు. కన్నడ తెలుగు భాషశబ్దం ఒకటే కానీ పలికే విధానం మాత్రమే తేడా ఉంటుందని ఆయన వెల్లడించారు.
అందుకే తాను తెలుగు తొందరగా నేర్చుకున్నానని మరోసారి మీ ముందుకు వచ్చినప్పుడు అచ్చమైన తెలుగులో మాట్లాడతానని యువరత్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో వెల్లడించారు. ఇకపోతే త్వరలోనే రాజ్ కుమార్ పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తున్నారన్న విషయాన్ని కూడా ఇదే వేదికపై తెలియజేశారు.
ఇలా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని తెలియజేసిన పునీత్ ఆ కోరిక నెరవేరకుండానే హఠాత్ మరణం పొందడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పునీత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…