Categories: FeaturedMovie News

అభిమాన నటుడు ఆఖరి చూపు కోసం కంఠీరవ స్టేడియానికి పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు..!

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం దక్షిణాది సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఆయన లేరన్న మరణవార్త నుంచి ఇప్పటికీ పలువురు సినీ ప్రముఖులు అభిమానులు బయటపడలేక పోతున్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరూ నటుడు పునీత్ తో తనకున్న అనుబంధాన్ని బయట పెడుతూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఇకపోతే శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకి తరలించారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నటుడి ఆఖరి చూపు కోసం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటూ తమ అభిమాన నటుడికి ఘన నివాళి అర్పించారు. ఇలా అభిమానుల రాకతో కంఠీరవ స్టేడియం కిక్కిరిసిపోయింది.

పునీత్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు కంఠీరవ స్టేడియానికి చేరుకొని అతని మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ రోజు మొత్తం పునీత్ పార్ధివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నట్లు సమాచారం. పునీత్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పునీత్ పెద్ద కుమార్తె జర్మనీలో ఉండడం చేత ఆమె వచ్చే వరకు ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏదిఏమైనప్పటికీ సినీ పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందనీ చిత్రపరిశ్రమ ఎంతో విచారం వ్యక్తం చేస్తోంది. పునీత్ మరణించడంతో కర్ణాటకలోని సినిమా థియేటర్లను రెండు రోజుల పాటు మూసి వేస్తూ సంతాపం ప్రకటించారు. ఇక ఇప్పటికే పునీత్ భౌతికకాయాన్ని నందమూరి బాలకృష్ణ సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈయన అంత్యక్రియలలో పాల్గొనడానికి ఎన్టీఆర్, మెగాస్టార్ కూడా బెంగళూరు రానున్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago