Categories: FeaturedGeneral News

పెళ్లికి 100 మంది అతిథులు.. జైలుకు వరుడు.. కారణం తెలిస్తే?

ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా ను కట్టడి చేయడానికి అధికారులు అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎటువంటి శుభకార్యాలకు అయినా, పెళ్లిళ్ల కైనా కేవలం 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే పంజాబ్ కు చెందిన ఓ యువకుడిని పెళ్లి అయిన మరుక్షణమే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

పెళ్లి మరుక్షణం పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది. జలంధర్‌లోని ఓ ఆలయంలో పెళ్లి జరిగిన వెంటనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వందమందికి పైగా అతిథులు రావడమే కాకుండా వారెవరు కరోనా నిబంధనలను, జాగ్రత్తలను పాటించకుండా వ్యవహరించడంతో ఈ విషయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని వరుడిని, అతని తండ్రిని అరెస్టు చేశారు. ఉన్నఫలంగా పోలీసులు అక్కడికి రావడంతో బంధువులందరూ అక్కడి నుంచి తల ఓవైపు వెళ్ళి పోయారు. ఈ క్రమంలోనే వరుడు తన పెళ్ళికి కేవలం కొంతమందిని మాత్రమే ఆహ్వానించానని, పెళ్లికి వచ్చిన వారు తమ బంధువులు స్నేహితులను తాము పిలవలేదని, పెళ్లికి వచ్చిన వారిని వెళ్ళిపొమ్మని చెప్పడం బాగుండదు అన్న ఉద్దేశంతోనే సైలెంట్ గా ఉన్నామని వరుడు వివరించాడు.

కరోనా నిబంధనలను పాటించని నేరానికి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగటంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించడమే కాకుండా సినిమా థియేటర్లు, పార్కులు కోచింగ్ సెంటర్లు వంటివి పూర్తిగా మూసి వేసినట్లు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago