Puri Jagannath : డైనమిక్ రైటర్ మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సినిమా హిట్టా, ప్లాపా అని పక్కన పెడితే సినిమాల్లో తాను హీరోని చూపించే విధానానికి ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే చాలా మంది హీరోలు ఆయనతో సినిమా చేయాలని అనుకుంటారు. అది పూరి కి ఉన్న ఇమేజ్ అలాంటి పూరి జగన్నాథ్ కి కవి కాళిదాసు కి వచ్చిన సేమ్ ఆలోచన ఏంటో తెలుసా.. కవి కాళిదాసు అంటే ఈ తరం వారికి తెలియకపోవచ్చు. ఆయన 1 మరియు 5 శతాబ్దం మధ్యకాలానికి చెందినవాడు. కవికులగురువు బిరుదాంకితుడు కాళిదాసు. అయినా మేఘసందేశం, విక్రమార్జున విజయం, కుమార సంభవం, రఘు వంశం వంటి మహా కావ్యలను రచించారు. శివ భక్తుడైన కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రము, విక్రమోర్వశీయము వంటి నాటకాలు రాసారు.
అయితే ఐదో శతాబ్దానికి చెందిన కాళిదాసు గారికి, నేటి డైరెక్టర్ పూరి కి ఉన్న లింకేంటి అంటారా.. ఇద్దరికీ ఒకేలాంటి ఆలోచన వచ్చింది. అది యాద్రుచ్చికమో, లేక మరేమిటో కానీ అలా ఒక సంఘటన జరిగింది. కవి కాళిదాసు ఉజ్జయిని రాజ్య రాజు భోజరాజు అస్థానంలో కవిగా ఉండాలని వెళ్లిన కాళిదాసుకి అక్కడ ఆస్థానంలో ఉన్న ఏక సంతాగ్రహీ, ద్వి సంతాగ్రహీ, త్రీ సంతాగ్రహీ ఎదురుపడ్డారు. వీళ్ళు ముగ్గురూ రాజు దగ్గర ఆస్తాన కవిగా రావాలని ఏ కవి వచ్చినా వారి కుయుక్తులతో ముందే ఏ కవిత్వం చెప్పాలనుకుంటున్నారో ఆ కవి ద్వారా తెలుసుకుని రాజు ముందు మరుసటి రోజు చెప్పమని చెప్పి రాజు ముందు చెప్పు సమయంలో వారు చెప్పి ఇదేమి కొత్త పద్యం కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని రాజు వద్ద పలానా కవిని దోషిని చేసి శిక్ష పడేలా చేస్తుంటారు. అలాంటి వారి వద్దకు కాళిదాసు గారు వెళ్ళినపుడు వారి ముందు ఒక పద్యం చెప్పగా రేపు వచ్చి రాజు ముందు చెప్పమని చెప్తారు. ఇక రాత్రంతా ఆ పద్యాన్ని కంఠస్తం చేస్తారు. ఇక రాజు ముందు కాళిదాసు శ్లోకం చెప్పవలసిన సమయం వచ్చినపుడు ఈ ముగ్గురి ముందు చెప్పిన శ్లోకం కాకుండా వేరే శ్లోకం చెప్పడం అది కుడా ఎక్కువ సంస్కృత పదాలతో నోరు తిరగని విధంగా ఉండటం తో ఏక సంతాగ్రహీ కి నత్తి సమస్య వల్ల చెప్పలేక పోతాడు. ఇక కాళిదాసు గారి పద్యం నచ్చినట్టు భోజరాజు ఆయనకు ఆస్థాన కవిగా పదవి ఇచ్చి కుయుక్తులు పన్నిన ఈ ముగ్గురికీ దండన విధించారు.
సరిగ్గా ఇలానే కాకపోయినా అటు ఇటుగా ఇలానే పూరి జగన్నాథ్ విషయంలో జరిగింది. పవన్ కళ్యాణ్ ను కలిసి కథ చెప్పి ఒప్పించాలనేది పూరి కల. ఆయన్ని ఎలా అయినా కలవాలని వెళితే అప్పట్లో పవన్ కంటే ముందు కథ చోటా కే నాయుడు విన్నాక ఆయన ఓకే అంటే పవన్ వింటాడు. దీంతో చోటా కే నాయుడు కి ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ కథ వినిపించాడు పూరి. కథ నచ్చింది ఓకే చేసి పవన్ కి చెప్పాడు చోటా కే నాయుడు. ఇక పవన్ వద్దకు వచ్చాక పూరి ‘బద్రి’ స్టోరి చెప్పాడు. చోటా కి చూపిన కథవేరుగా ఉంది ఈ కథ వేరుగా ఉందే అని అడిగితే నేను మీకు చెప్పాలనుకున్న కథ ఇదే ఆ కథ నచ్చితే ఈ కథ ఖచ్చితంగా నచ్చుతుందనే భావన తో అలా చేసానని చెప్పాడట. ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. ఇండస్ట్రీ లో కథ చోరీ చేసే అలవాటు ఎక్కువ ఒకవేళ బద్రి కథ కూడా మధ్యలో ఎవరైనా దొబ్బెస్తే అందుకే అలా జరగకుండా పూరి జాగ్రత్త పడ్డాడు. అయితే ఆ సంఘటనలో ఈ ఇష్యూ లో మధ్యవర్థులు డిఫరెంట్. ఇక్కడ చోటా కే నాయుడు మంచివాడు, అంతే తేడా…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…