Movie News

Karthikeya 2: కార్తికేయ 2 లో కలర్ స్వాతి స్థానంలో అనుపమ రావడానికి కారణం అదేనా.. కావాలనే పక్కన పెట్టారా?

Karthikeya 2: ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి సీక్వెల్ చిత్రం రావడం గమనార్హం. ఈ క్రమంలోనే 2014లో చందు మొండిటి దర్శకత్వంలో నిఖిల్ కలర్స్ స్వాతి జంటగా నటించిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ పనులన్నిటిని పూర్తి చేసుకొని ఈనెల 13వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి కాకుండా ఆమె స్థానంలోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చారు.ఇలా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నటించడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు.కార్తికేయ సినిమాలో నటించిన కలర్ స్వాతిని కావాలని పక్కన పెట్టి ఆమె స్థానంలో ఈమెను తీసుకున్నారా అనే సందేహం కూడా వ్యక్తం చేశారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న హీరో నిఖిల్ కి సైతం ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే కలర్స్ స్వాతి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి నటన ఎంతో అద్భుతంగా ఉంది అయితే ఈ సినిమాలో ఆమెను తీసుకోకపోవడానికి ఒక కారణం ఉందనీ తెలిపారు.

Karthikeya 2: నార్త్ ఇండియన్ లుక్ కోసమే…

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నార్త్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి లుక్ కనిపించాల్సి ఉంటుంది. ఇక కలర్స్ స్వాతి అచ్చు తెలుగు అమ్మాయిలా ఉండటం వల్ల తనని ఈ పాత్ర నుంచి తప్పించి ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు ఈ సందర్భంగా నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన హీరోయిన్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago