Puri Jagannath : ఆకాష్ పూరీ హీరోగా నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ బాగా వైరల్ అయింది. పూరీ జగన్నాథ్ తన కొడుకు సినిమా ఈవెంట్ కు రాలేనంత బిజీ ఏంటి అంటూ వ్యాంపులు, రాంపులు మామూలే వస్తుంటారు, పోతుంటారు కానీ భార్య పిల్లలను వదులుకోరాదు, పిల్లలకోసమే మనం బతికేది అంటూ లెక్చర్ ఇచ్చాడు. ఎంతోమంది స్టార్లను చేసిన నువ్వు కొడుకు కోసం రాలేనంత బిజీనా అంటూ మాట్లాడాడు బండ్ల గణేష్. ఇక స్టార్ హీరోలను కూడా ఆకాష్ కోసం రాలేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఈ విషయం పై పరోక్షంగా పూరీ స్పందించాడు.
ఒకరి గురించి మాట్లాడేటపుడు జాగ్రత్త ఉండాలి…
ఇక పూరీ పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేష్ కు కౌంటర్ ఇచ్చాడు. మౌనంగా ఉండటం గొప్ప వరం, ఎదుటి వారు మాట్లాడేటపుడు ఎక్కువగా విని తక్కువ మాట్లాడటం వళ్ళ చాలా సాధిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఒకరి గురించి వాగే ముందు ఏం మాటాడుతున్నామో తెలుసుకుని ఎలాంటి మాటలు మాటాడుతున్నామో గుర్తుంచుకుని మాట్లాడాలి.
ఏం ఆలోచించకుండా ఇంకొకరి జీవితం, కెరీర్ నాశనం చేయకూడదు అంటూ కౌంటర్ ఇచ్చారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన ఆలోచనలు అభిమానులతో పంచుకునే పూరీ తాజాగా ఈ మాటలను పోస్ట్ చేయడంతో అందరూ ఇది బండ్ల గణేష్ కు కౌంటర్ అనుకుంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…