Pushpa 2: పుష్ప సినిమాలోని కొన్ని డైలాగ్స్ కొంతమందిని టార్గెట్ చేస్తూ రాసారని స్పష్టంగా తెలుస్తుంది. నా స్నేహితుడి కోసం నేను ఎక్కడికైనా వస్తాననే డైలాగ్ అల్లు అర్జున్ పరోక్షంగా కూటమి నేతలకే చెప్పారని స్పష్టం అవుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఈయన తన స్నేహితుడికి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్లారు అయితే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డైలాగ్ పెట్టారని అందరూ భావిస్తున్నారు. పరోక్షంగా ఈ డైలాగ్ ద్వారా పవన్ కళ్యాణ్ అలాగే మెగా అభిమానులకు కౌంటర్ ఇచ్చారని కూడా తెలుస్తుంది.
ఇకపోతే ఈ సినిమాలోని మరో డైలాగు కూడా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పెట్టారంటూ ఈ డైలాగు సంచలనంగా మారడమే కాకుండా ఈ డైలాగు విషయంపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ సన్నివేశంలో డైలాగ్ చెబుతూ ఎవడ్రా బాస్.. ఎవడికి రా బాస్.. ఆడికి ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ ఈ డైలాగ్ ఉంది.
ఇక ఈ డైలాగు సన్నివేశానికి అనుగుణంగా పెట్టారు తప్ప ఎవరిని కించపరిచే విధంగా పెట్టి ఉండరు కానీ కొంతమంది మాత్రం ఈ డైలాగ్ తప్పనిసరిగా మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూ చెప్పిన విధంగా ఉంది అంటూ మెగా అభిమానులు ఈ డైలాగుపై మండిపడుతున్నారు.
ఇక ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లు రైటర్స్ డైరెక్టర్స్ మెగా హీరోలకు కూడా పనిచేస్తారు కాబట్టి మెగా హీరోలను కించపరిచే విధంగా అయితే పెట్టి ఉండరని సన్నివేశానికి అనుగుణంగా మాత్రమే ఇలాంటివి పెట్టి ఉంటారు అంటూ పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోబోతుందని స్పష్టం అవుతుంది. ఈ తరుణంలోనే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాపై ఇప్పటికి నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారని బన్నీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…