Featured

పుష్ప సినిమా ప్రమోషన్స్ కోసం వేసిన మాస్టర్ ప్లాన్స్ ..!

ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఆడియో ఫంక్షన్స్ మాత్రమే నిర్వహించేవారు. దాన్ని భారీ లెవల్లో ప్లాన్ చేసి సినిమా మీద అంచనాలు పెంచేవారు. ఆడియో సూపర్ హిట్ అయితే ప్లాటినమ్ డిక్స్ ఫంక్షన్, డబుల్ ప్లాటినమ్, ట్రిపుల్ ప్లాటినమ్ అంటూ హడావుడి చేసేవారు. అదే సినిమా ప్రమోషన్స్ అయ్యేవి. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు వచ్చాక ప్రమోషన్స్‌లోనూ కొత్త పోకడలు పోతున్నారు. సినిమా మొదలైన కొన్ని వారాలకే ఫస్ట్ అని, టైటిల్ పోస్టర్ అని సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకుల్లో అంచనాలు కలిగించడం మొదలు పెడుతున్నారు.

అలా ఈ మధ్యకాలంలో అన్నీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇలా సోషల్ మీడియాలోనే వదులుతున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో రూపొందుతున్న సినిమాలకైతే వివిధ భాషలలోని నటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు కాబట్టి ఆయా భాషాల్లోని స్టార్స్‌ను గెస్టులుగా ఆహ్వానించి స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనవాళ్ళకి కావాల్సింది. బాలీవుడ్ మార్కెట్ మీద బాగా గ్రిప్. అందుకే ప్రమోషన్స్ కూడా ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు.

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ప్రమోషన్స్‌కు ఇలాంటి వినూత్నమైన ప్రమోషన్సే మేకర్స్ ప్లాన్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమా పుష్ప ది రైజ్ పార్ట్ 1 ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 17న 5 భాషలలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల బడ్జెట్ కేటాయించి నిర్మించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే సినిమా మీద భారీగా అంచనాలు పెరగగా రిలీజ్ సమయం దగ్గరపడుతున్నా కొద్ది ఆ అంచనాలు మరోస్థాయిలో పెంచడమే మేకర్స్ పెట్టుకున్న పెద్ద టార్గెట్. ఈ క్రమంలోనే సమంతతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు. అలాగే డాన్స్ షో ఢీ 13 గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది. ఇక ఈ ఎపిసోడ్‌లో ఎక్కువగా పుష్ప సినిమా గురించే బన్నీ మాట్లాడతాడని తెలుస్తోంది.

ఇదే క్రమంలో హిందీ బిగ్ బాస్ సీజన్‌లో సల్మాన్ ఖాన్‌లో కలిసి బన్నీ సందడి చేయబోతున్నాడని తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో పుష్ప సినిమా ప్రమోట్ చేయడానికే మేకర్స్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏ మాత్రం ఛాన్స్ దొరికినా పుష్ప సినిమానూ అన్నీ భాషల్లో గట్టిగా ప్రమోషన్స్ నిర్వహించడానికే మేకర్స్ రెడీ అయ్యారట. ఇక ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అలాగే సుకుమార్ – అల్లు అర్జున్‌కు హిందీ డెబ్యూ సినిమా కావడం విశేషం. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా.. ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి!

వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…

5 minutes ago

చక్రి మరణంపై షాకింగ్ నిజాలు.. రఘు కుంచె క్లారిటీ

దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…

23 minutes ago

ఇలా కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్!

ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…

35 minutes ago

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

1 hour ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

1 hour ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

2 hours ago