Pushpa:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించినటువంటి చిత్రం పుష్ప.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను రాబట్టింది.
ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 9 నెలలు పూర్తి అయినప్పటికీ ఇంకా ఈ సినిమాకు ఏ విధమైనటువంటి క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్ చేశారు. అందరూ అనుకున్నట్టు పుష్ప సినిమా హిట్ కాలేదని ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పుష్ప సినిమా సౌత్ ఇండస్ట్రీలో భారీ నష్టాలను ఎదుర్కొంది. ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. నార్త్ ఇండస్ట్రీలో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా హిట్ అయిందని టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు మాత్రం భారీగా నష్టపోయారంటూ ఈయన కామెంట్ చేశారు. ఇలా నష్టపోవడానికి ఓ కారణము ఉందంటూ తేజ వెల్లడించారు.
పుష్ప సినిమా విడుదల సమయంలో తెలంగాణలో కొంతమేర లాభాలు వచ్చినప్పటికీ ఆంధ్రాలో మాత్రం భారీ నష్టాలు వచ్చాయి. ఈ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. తద్వారా సినిమా నష్టాలను ఎదుర్కొందని అయితే కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రం టికెట్ ధర కన్నా అక్కడ దొరికే కూల్ డ్రింక్, పాప్ కార్న్ ధరలు కూడా ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా చూసే పరిస్థితులు ఏర్పడలేదనీ డైరెక్టర్ పుష్ప సినిమా గురించి తెలియజేశారు.
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచిన…