Radhamonal naval : గ్లామర్ ప్రపంచంలోని జీవితాలు చాలా వరకు విషాదంగానే ముగుస్తాయి. సినిమాలో చూపించినంత అందంగా ఎందుకో నిజ జీవితంలో జీవితాలు ఉండవు. ఆర్టిస్టులు చాలా సున్నితంగా ఉంటారని అంటారు. అందుకేనేమో ప్రేమ విఫలమైనా, అవకాశాలు లేక స్టార్ డమ్ పోయినా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అలా మరణించిన తారలు ఎందరో. అయితే కొంతమంది ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టి ఆత్మహత్య చేసుకున్నారని చెబుతారు కానీ అసలు నిజంగా వారిది ఆత్మహత్య లేక వేరేనా అనేది మిస్టరీగానే మిగిలిపోతుంది. అలాంటి ఒక ఉదంతం సిమ్రాన్ చెల్లి మరణం.
ప్రేమ విఫలమై ఆత్మహత్య…
సిమ్రాన్ దక్షిణాదిన ఒక దశాబ్దం పాటు నెంబర్ వన్ గా ఏలిన హీరోయిన్. తమిళ, తెలుగు, మలయాళం అంటూ అన్ని భాషలలోను అగ్రతారగా వెలిగిన ముద్దుగుమ్మ. టాప్ హీరోస్ అందరి సరసన నటించిన సిమ్రాన్ చెల్లెలు రాధా మోనాల్ నావల్ కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి అడుగుపెట్టింది. సిమ్రాన్ బిజీ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే రాధమోనాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం ఉపయోగించకుండా మోడలింగ్ చేస్తూ సినిమా అవకాశాన్ని దక్కించుకుంది. ఇస్ బాంబే గా గెలిచి కన్నడ సినిమా ‘ఇంద్రధను’ష్ తో ఎంట్రీ ఇచ్చిన రాధ మోనాల్ తమిళ సినిమా బద్రి లో విజయ్ సరసన నటించింది. ఆ తరువాత వరుసగా పార్వయ్ ఒండ్రే పొదుమే, లవ్లీ, సుముదిరం వంటి సినిమాల్లో చేసి బిజీ అయింది. ఇక తెలుగులో ఇష్టం సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక హిందీ లో ‘మా తుజే సలాం’ సినిమా లో నటించింది.
2000 సంవత్సరంలో 18 ఏళ్ల వయసులో సినిమా కెరీర్ మొదలు పెట్టిన రాధా మోనాల్ 2002 ఏప్రిల్ 14 న చెన్నై లోని తన ఇంట్లో గదికి లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి సుసైడ్ నోట్ దొరకలేదు. ఇక తన చెల్లి మరణానికి కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని సిమ్రాన్ ఆరోపించారు. ప్రసన్న సుజిత్ తనను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోమంటే కుదరదు అనడంతో తన చెల్లి ఆత్మహత్య చేసుకుందని సిమ్రాన్ చెప్పారు. కానీ ప్రసన్న వల్లే రాధామోనాల్ మరణించినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇక ఆ మరణం మిస్టరీ గానే మిగిలిపోయింది నేటికీ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…