సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం జై భీమ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. దీనిని 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో సినతల్లి ఎదుర్కొన్న కష్టాలను స్పష్టంగా చూపించారు. ఈ చిత్రాన్ని చూసిన సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సినిమా చూసి సూర్యకు లేఖ రాయడం విశేషం. అయితే తాజాగా ఈ సినిమా చూసిన నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ చలించిపోయారు. రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకుని రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు. ఒక తప్పుడు కేసు కారణంగా రాజకన్ను భార్య పార్వతి పడిన బాధ హీరో లారెన్స్ దృష్టికి వచ్చింది.
ప్రస్తుతం ఆమె పూరి గుడిసెలో జీవిస్తున్నట్లు తెలుసుకుని చలించిపోయారు. పార్వతికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పార్వతి అమ్మాళ్‌కి తన స్వంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. లారెన్స్ ప్రకటనతో అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన దాతృత్వానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, లిజోమోల్ జోస్, మణికందన్ తదితరలు కీలక పాత్రలు పోషించారు. సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ నటన అద్భుతం అనే చెప్పాలి. అంతగా డీ గ్లామర్ గా మారి ఆమె ప్రేక్షకులను మెప్పించారు. లాయర్ చంద్రు పాత్రలో హీరో సూర్య జీవించేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…