మనకు దాదాపు బామ్మ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన నటి నిర్మలమ్మ. ఆమె అసలు పేరు రాజమణి. ఆమె మొదట 1943లో పదహారేళ్ల వయస్సులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు.
ఆమె అలనాటి స్టార్ హీరోలయిన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, యస్వీ రంగారావుల దగ్గర నుంచి నేటి స్టార్లు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. ఆమె మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు. వయస్సు మీద పడిన తర్వాత కూడా ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు.
చివరగా స్నేహం కోసం సినిమా తర్వాత నటించడం మానేశారు. తర్వాత ఆమె 2009లో స్వర్గీయులు అయ్యారు. ఇదంతా ఇలా ఉండగా.. ఆమె యుక్త వయస్సులో ఎలా ఉండేదో తెలుసా.. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 10 వరకు చదుకున్న ఈ నిర్మలమ్మ నాటకాల్లో మంచి పాత్రలు పోషించేవారట.
ఇంట్లో వాళ్లు నాటకాలు వేయడానికి సపోర్టు చేసేవారు కాదట.. కానీ పెద్దనాన్న మాత్రం సపోర్టు ఇచ్చేవారట. అలా ఆమె ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె 19 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు. ఆ యుక్త వయస్సులో ఉన్నప్పుడు దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిర్మలమ్మ చాలా అందంగా కనిపించారు. మరెందుకాలస్యం ఆ ఫొటోలను మీరూ చూసేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…