Raghavendhra Rao : ఇండస్ట్రీ లో హీరోయిన్ ని గ్లామర్ గా చూపించాలంటే అది రాఘవేంద్ర రావు తరువాతే. అయన చూపించినంత అందంగా మరే దర్శకుడు హీరోయిన్ ను చూయించలేడు. సినిమాల్లో అంత రొమాంటిక్ గా హీరో హీరోయిన్లను చూపించే రాఘవేంద్ర రావు నిజానికి బయట చాలా మిత భాషి. చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా అసలు ఎక్కువగా సినిమా ఫంక్షన్స్ కి రాడు. అయన వచ్చినా పెద్దగా స్టేజి మీద మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక ఆయన కోప్పడిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఆయన స్టేజి మీదే కోప్పడ్డారు.
సుధీర్ ఫ్యాన్స్ ను తిట్టిన దర్శకేంద్రుడు…
రాఘవేంద్ర రావు సమర్పణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కోవెలమూడి సాయి బాబు, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్న ఈసినిమాలో సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, వంటి కమెడియన్స్ యాంకర్ అనసూయ నటించిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ ఈ సినిమా ఆగష్టు 19 న విడుదల అవ్వబోతుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈవెంట్లో రాఘవేంద్ర రావు మాట్లాడితు బింబిసార, సీతారామం, కార్తికేయ వంటి చిన్న సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అలానే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. ఇక అనసూయ ఈ సినిమలో కీలక పాత్రలో నటించింది.
ఇక అనసూయ మాట్లాడుతున్న సమయంలో సుధీర్ స్టేజి మీదకి రావడంతో అయన ఫ్యాన్స్ బాగా గోల చేసారు. అనసూయ మాట్లాడేది అసలు వినిపించకుండా గోల చేస్తుండడంతో రాఘవేంద్ర రావు గారు అసహనానికి లోనయ్యారు. వెంటనే మైక్ తీసుకుని కోపడ్డారు, అయినా వినిపించుకోకుండా అరవడంతో ఆయన కోప్పడ్డారు. సుధీర్ తో సహా ప్రతి ఒక్కరు మాట్లాడుతారు కొంచెం ఓపిక పట్టండి అంటూ అన్నాకూడా వినిపించుకోక పోవడంతో పిచ్చిపిచ్చిగా ఉందా? అసలు వీళ్లను ఎవరు పిలిచారు? పెద్దా చిన్నా తేడా లేదా? బిహేవియర్ బాగోకపోతే బయటకు పంపించేస్తాం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎపుడు సైలెంట్ గా ఉండే రాఘవేంద్ర రావు అలా కోప్పడే సరికి అందరూ సైలెంట్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…