Rahul Ramakrishna: మొదటిసారిగా కొడుకు ఫోటో షేర్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ.. వైరల్ అవుతున్న ఫోటో..?

Rahul Ramakrishna: అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడు పాత్రలో నటించిన అందరినీ ఆకట్టుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్న రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

జాతి రత్నాలు, గీత గోవిందం, భరత్ అనే నేను, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా రాహుల్ రామకృష్ణ తాజాగా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. రాహుల్ రామకృష్ణ తనకు పెళ్లైన సంగతి చాలా కాలం బయట పెట్టలేదు. గతేడాది నవంబర్లో తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

ఇక ఈ ఏడాది సంక్రాంతి రోజున తనకు వారసుడు జన్మించినట్లు ట్వీట్ చేశాడు. కానీ ఇప్పటివరకు తన కొడుకుని ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. తాజాగా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ తన కొడుకు పేరు కూడా రివీల్ చేశాడు. రాహుల్ రామకృష్ణ భార్య కొడుకు కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ… రూమి అని తన కొడుకు పేరును చేశాడు.

Rahul Ramakrishna: కొడుకు పేరు రివీల్ చేసిన కమెడియన్..

మొదటిసారిగా భార్య, కొడుకు కలసి ఉన్న ఫోటోని రాహుల్ రామకృష్ణ షేర్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసినా నెటిజన్స్ జూనియర్ రాహుల్ అంటూ కామెంట్స్ చేస్తూ రాహుల్ రామకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ప్రముఖ పర్షియన్ కవి అయిన రూమి పేరుని రామకృష్ణ తన కొడుకుకి పెట్టడం గమనార్హం.