Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మెగా వారసుడు కోసం ఇటు అభిమానులు అటు కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో ఉపాసన సీమంతం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రస్తుతం ఉపాసన బేబీ షవర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఉపాసనకి పుట్టబోయే బిడ్డ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. చిరంజీవి , రామ్ చరణ్ సినీ వారసత్వాన్ని కొనసాగించడానికి వారసుడు పుట్టాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే మెగా కుటుంబంలోకి అడుగుపెట్టేది వారసుడు కాదని వారసురాలని ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఉపాసనకి కూతురే పుడుతుందని చెప్పటానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ మొదటి ఆధారంగా చెబుతున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లుడుతూ… థర్డ్ జూన్ ఆన్ ‘హెర్’ వే… అని అన్నాడు. అంటే పుట్టబోయేది అమ్మాయి అని రామ్ చరణ్ హింట్ ఇచ్చాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఉపాసన బేబీ షవర్ వేడుకలో పింక్ కలర్ హైలెట్ చేశారు.
ఈ వేడుకలో ఉపాసన సైతం మిల్కీ పింక్ కలర్ ట్రెండీ డ్రెస్ ధరించింది. దీంతో పింక్ కలర్ అమ్మాయికి సూచన అని, పుట్టబోయేది అమ్మాయని తెలియటంతో రామ్ చరణ్-ఉపాసన అలా పింక్ కలర్ థీమ్ తో బేబీ షవర్ వేడుకలకు డెకరేట్ చేశారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. పుట్టబోయేది అమ్మాయా లేక అబ్బాయా అని తెలియాలంటే లింగ నిర్దారణ పరీక్ష చేయించాలని కానీ, అది చట్టరీత్యా నేరం అని అంటున్నారు. మరి మెగా కాంపౌండ్ లో వారసుడు అడుగు పెడతారా వారసురాలు అడుగు పెడతారా తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…