Niharika: మెగా డాటర్ నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా చైతన్యతో నిహారిక విడాకుల వార్తలకు అస్సలు బ్రేక్ పడటం లేదు. అయితే నిహారిక మాత్రం ఈ వార్తల గురించి ఏ మాత్రం స్పందించకుండా తన పని తాను చేసుకుపోతోంది. నిహారిక నిర్మాతగా మారి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మించే పనిలో బిజీగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా నిహారిక షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా డాటర్ నిహారిక, ఇంఫ్లూయెన్సర్ నిహారిక ఇలా ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఈ క్రమంలో నిన్నటి రాత్రి ఈ ఇద్దరూ కూడా రాత్రంతా ఇంట్లోనే సినిమా చూస్తూ ఎంజాయ్ చేసినట్టుగా కనిపిస్తోంది.
మూవీ టైం అంటూ ల్యాప్ ట్యాప్‌లో సినిమాను చూస్తూ, స్నాక్స్ తింటూ సందడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా నిహారికా గురించి ఏ చిన్న వార్త వినిపించినా కూడా వెంటనే స్పందించే నాగబాబు గత కొంతకాలంగా నిహారిక విడాకుల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలపై స్పందించకపోవడం అందరిలో అనుమానం కలిగిస్తుంది.
కళ్యాణ్ దేవ్, శ్రీజ లాగా నిహారిక, చైతన్య కూడా చప్పుడు కాకుండా విడాకులు తీసుకున్నారా అని అందరిలో అనుమానం మొదలైంది. వీరి విడాకుల గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా కూడా వీరు ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు. అంతే కాకుండా నిహారిక , చైతన్య సోషల్ మీడియాలో కూడా ఇద్దరు కలసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసి ఒకరినొక అన్ ఫాలో చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…