Movie News

Anasuya: చలాకి చంటి కోసం హాస్పిటల్ కి వెళ్లిన అనసూయ ఏం చేసిందో తెలుసా..?

Anasuya: ప్రముఖ నటుడు కమెడియన్ చలాకి చంటి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఇటీవల చంటి కి ఛాతీనొప్పి రావడంతో అతని కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చంటి నీ పరీక్షించిన వైద్యులు గుండెపోటు అని వెల్లడించారు . మెరుగైన వైద్యం కోసం ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. రక్తనాళాలలో కూడికలు ఉండటం వల్ల వచ్చిందని, అయితే ప్రస్తుతం డాక్టర్లు సర్జరీ చేసి స్టంట్ వేయడంతో చంటి ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.

ఇక చంటి అనారోగ్యం గురించి తెలియగానే అతని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా హాస్పిటల్ కి వెళ్లి చంటి నీ పరామర్శించారు. ఈ క్రమంలో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ కూడా చంటి నీ పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రికి వెళ్ళిన అనసూయ చంటిని పరామర్శించడమే కాకుండా డాక్టర్స్ ని సంప్రదించి చంటి ఆరోగ్యం గురించి తెలుసుకొని .. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరినట్టు సమాచారం.

ప్రస్తుతం వీరిద్దరూ జబర్డస్త్ లో లేకపోయినా కూడా ..మంచి అనుబంధం ఉంది. కేవలం చంటితో మాత్రమే కాకుండా జబర్థస్త్ ఆర్టిస్టులతో ఇప్పటికీ అనసూయ టచ్ లో ఉంటోంది. ఇదిలా ఉండగా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన చంటి జబర్దస్త్ కి వచ్చిన తర్వాత తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ చలాకి చంటిగా మంచి గుర్తింపు పొందాడు. ఇలా కమెడియన్ గా మాత్రమే కాకుండా టీవీ షోలలో యాంకర్ గా కూడా వ్యవహరించాడు.

Anasuya:చంటినీ పరామర్శించిన అనసూయ…

ఇక జబర్దస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొన్ని వారాలకి చలాకి చంటి బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఒకటి రెండు షోలలో కనిపించిన చలాకీ చంటి చాలాకాలంగా బుల్లితెర మీద ప్రేక్షకులకు కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం చంటి అనారోగ్యం గురించి తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ చంటి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago