Rahul Ramakrishna: అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడు పాత్రలో నటించిన అందరినీ ఆకట్టుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్న రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
జాతి రత్నాలు, గీత గోవిందం, భరత్ అనే నేను, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా రాహుల్ రామకృష్ణ తాజాగా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. రాహుల్ రామకృష్ణ తనకు పెళ్లైన సంగతి చాలా కాలం బయట పెట్టలేదు. గతేడాది నవంబర్లో తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
ఇక ఈ ఏడాది సంక్రాంతి రోజున తనకు వారసుడు జన్మించినట్లు ట్వీట్ చేశాడు. కానీ ఇప్పటివరకు తన కొడుకుని ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. తాజాగా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ తన కొడుకు పేరు కూడా రివీల్ చేశాడు. రాహుల్ రామకృష్ణ భార్య కొడుకు కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ… రూమి అని తన కొడుకు పేరును చేశాడు.
మొదటిసారిగా భార్య, కొడుకు కలసి ఉన్న ఫోటోని రాహుల్ రామకృష్ణ షేర్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసినా నెటిజన్స్ జూనియర్ రాహుల్ అంటూ కామెంట్స్ చేస్తూ రాహుల్ రామకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ప్రముఖ పర్షియన్ కవి అయిన రూమి పేరుని రామకృష్ణ తన కొడుకుకి పెట్టడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…