టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఎన్నో వివాదాలు.. మరెన్నో సంచలనాలతో రసవత్తరంగా ప్రేక్షకులను అలరించిన ‘బిగ్ బాస్ 3’ రియాలిటీ షోలో సోషల్ మీడియా సెలబ్రిటీ, జూనియర్ సమంతాగా క్రేజ్ సంపాదించుకున్న.. ‘అషు రెడ్డి’ మూడో కంటెస్టెంట్‌గా ఎంటరైన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఎంట్రీ చూసిన జనం అందరూ షాకయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె సమంతా లుక్‌లో స్లిమ్‌గా వుండటమే కాకుండా నటి నమితలా బొద్దుగా ఉండడమే అందుకు కారణమని నెటిజన్లందరి అభిప్రాయం.
బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన సంగతి విదితమే. ఇక అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ 3 షో కొనసాగినంతకాలం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా నడుస్తోందేమోనన్న ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ ని ఇదే విషయంపై ప్రశ్నించగా “పునర్నవి డ్రీం బాయ్ నేను కాదు. తనకీ ఆల్ రెడీ వేరే వ్యక్తి ఉన్నాడు. మా ఇద్దరివీ వేర్వేరు జీవితాలు. కానీ మా ఇద్దరి మధ్యా ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే.. అంతేకానీ మీరనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్యా ఏ రొమాంటిక్ రిలేషన్ లేదు’’ అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని స్వయంగా పునర్నవియే చెప్పడంతో నెటిజన్లందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
ఇదిలా ఉంటే పునర్నవిని కాదని బిగ్ బాస్ హౌజ్ లో మరో కంటెస్టంట్ గా పాల్గొన్న అషు రెడ్డితో రాహుల్ ఈమధ్య చాలా క్లోజ్ గా ఉంటున్నాడనే గాసిప్స్ వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చేసిన తర్వాత పార్టీలని, మీటింగులని అందరూ అందర్నీ కలుస్తున్నారు. కానీ మాత్రం ప్రత్యేకంగా రాహుల్ అషు రెడ్డినే ఎక్కువగా కలుస్తున్నాడు. తాజాగా వీళ్లిద్దరిని 1,2 సార్లు జంటగా చూసిన ప్రేక్షకులు రాహుల్ ను “మీ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారా.?” అనడిగితే “అవును… మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాం.. మా రిలేషన్ పేరు జిగిడి దోస్త్” అంటూ బదులిన్నాడు రాహుల్. ఏం జిగిడీ దోస్తులో.. ఏందో.. ఈ ప్రేమలేందో.. దోస్తులేందో జర మీ ధిమాక్ ఖరాబ్ కాకముందే వీళ్ళ గోల మర్చిపోండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…