Featured

Hero Raj Tharun: అయ్యో రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది… మరో ఫ్లాప్ తో రాజ్ తరుణ్!

Hero Raj Tharun: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉయ్యాల జంపాల అనే చిత్రంలో హీరోగా నటించే అవకాశాన్ని అందుకొని ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటుడు రాజ్ తరుణ్ గురించి అందరికీ సుపరిచితమే.మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న హీరో రాజ్ తరుణ్ ఆతర్వాత సినిమా చూపిస్త మామ, కుమారి 21 F సినిమా ద్వారా వరుస విజయాలను అందుకున్నారు.

Hero Raj Tharun: అయ్యో రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది… మరో ఫ్లాప్ తో రాజ్ తరుణ్!

ఈ విధంగా వరుస విజయాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజ్ తరుణ్ పై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే ఈయన వద్దకు నిర్మాతలు క్యూ కట్టారు.ఈయన నటించిన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకుని వరుస అవకాశాలు రావడంతో వారు పూర్తిగా తన రెమ్యూనరేషన్ పెంచేశారు.

Hero Raj Tharun: అయ్యో రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది… మరో ఫ్లాప్ తో రాజ్ తరుణ్!

ఇలా ఈయన వరుస అవకాశాలు అందుకుని వరుస చిత్రాలలో నటించిన ఏ సినిమా కూడా తనకు మంచి హిట్ ఇవ్వలేక పోయాయి. దీంతో వరుస ఫ్లాప్ లను చవిచూస్తున్న రాజ్ తరుణ్ స్పీడ్ కు కాస్త బ్రేక్ పడింది. ఇలా వరుసగా ఎనిమిది ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కు మరొక అవకాశం వచ్చింది.

వరుస ఫ్లాప్ లతో సతమతం…

ఇలా వరుస ప్లాప్ సినిమాలతో సతమతమౌతున్న రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా రాజ్ తరుణ్ కు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. సినిమా విడుదలైన తర్వాత ఫిలిం క్రిటిక్స్ ఈ సినిమాపై నెగెటివ్ రివ్యూ ఇవ్వడంతో పూర్తిగా కలెక్షన్లు పడిపోయాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సంపాదించుకొని తొమ్మిదవ ఫ్లాప్ సినిమాగా నిలబడింది. ఇలా రాజ్ తరుణ్ వరుస ఫ్లాప్స్ సినిమాలను చూడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ అతనికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.ఇకపై కథలను ఎంపిక చేసుకునే సమయంలో ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

44 minutes ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

52 minutes ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

56 minutes ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

2 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

2 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

3 hours ago