ప్రస్తుతం అన్ని సినిమాలను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాయి సినీ పరిశ్రమలు.. బాహుబలి ద్వారా తెలుగు పరిశ్రమ నీ ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి తెరెక్కిస్తున్న చిత్రం “ఆర్ ఆర్ ఆర్”.. ఈ చిత్ర షూటింగ్ ను శరవేగంగా నడిపిస్తున్నారు చిత్ర యూనిట్. బాహుబలి తర్వాత జక్కన చేస్తున్న చరిత్మత క సినిమా ఇది. ఈ మూవీకి సంబందించిన అన్ని విషయాలలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎన్నో సందిగ్దతల మధ్య వాయిదాలు పడుతూ వచ్చింది. మొదటగా జూలై 30 న విడుదల చేద్దాం అనుకున్న సినిమాను ఇపుడు 2021 జనవరి 8న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్..
ఆర్.ఆర్.ఆర్ చిత్రం విడుదల వాయిదా పడడం వల్ల ఇంకో భారీ సినిమా కి లైన్ క్లియర్ అయిందని చెప్పచ్చు. అదేనండి కన్నడ హీరో యాష్ నటించిన కె.జి.ఎఫ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ మూవీ గణ విజయాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వత హీరో యాష్ కి అభిమానులు కూడా విపరీతంగా పెరిగిపోయారు. కెజిఫ్ లో యాష్ యాక్టింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కెజిఫ్ కి సీక్వెల్ వస్తోందని అప్పట్లోనే అనౌన్స్ చేశారు. అదే “కెజిఫ్ చాప్టర్ 2”. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్న సమయంలో ఆర్ ఆర్ ఆర్ విడుదల కూడా ఉంటే కష్టమని భావించారు. అయితే అదే సమయంలో రాజమౌళి #RRR విడుదల తేదీని జనవరి 8వ తేదీకి వాయిదా వేయడంతో కెజిఫ్- 2 చిత్ర యూనిట్ తమ సినిమాకి లైన్ క్లియర్ అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో “కేజిఫ్ – 2” భారీస్థాయిలో రిలీజ్ కి సిద్దమవుతోంది. జూలై 30 కెజిఫ్ కి ఎలా కలిసి వస్తుందో చూడల్సివుంది..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…