Featured

Rajasekhar -Jeevitha: రాజశేఖర్ జైలుకు వెళతాడు.. జీవిత డేంజరస్.. జోస్టర్‌ ఫిలిమ్ సర్వీసెస్ కామెంట్స్ వైరల్!

Rajasekhar -Jeevitha: సీనియర్ హీరో రాజశేఖర్ జీవిత దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. జీవిత రాజశేఖర్ తమను దారుణంగా మోసం చేశారని జోస్టర్ ఫిలిమ్ సర్వీసెస్ సభ్యులు మీడియా ముందు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే జీవిత రాజశేఖర్ గురించి వీరు చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Rajasekhar -Jeevitha: రాజశేఖర్ జైలుకు వెళతాడు.. జీవిత డేంజరస్.. జోస్టర్‌ ఫిలిమ్ సర్వీసెస్ కామెంట్స్ వైరల్!

శుక్రవారం జోస్టర్‌ ఫిలిం సర్వీసెస్‌ డైరెక్టర్‌ కోటేశ్వర్‌ రాజు, ఎండీ హేమ మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ జీవిత దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ వద్ద నుంచి 26 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారనిఎండీ హేమమీడియా ముందు వెల్లడించారు. రాజశేఖర్ తండ్రి విన్నపం మేరకు రాజశేఖర్ ఆస్తులను తాకట్టు పెట్టుకుని వారికి 26 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించారు.

Rajasekhar -Jeevitha: రాజశేఖర్ జైలుకు వెళతాడు.. జీవిత డేంజరస్.. జోస్టర్‌ ఫిలిమ్ సర్వీసెస్ కామెంట్స్ వైరల్!

రాజశేఖర్ దంపతులు వారి ఆస్తులను బినామీ పేర్ల పై మార్చుకుని దారుణంగా మోసం చేశారని, వారి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎండీ హేమ ఆవేదన వ్యక్తం చేశారు.జీవిత రాజశేఖర్ దంపతులు చాలా డేంజరస్ అని త్వరలోనే రాజశేఖర్ జైలుకు కూడా వెళ్తారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే వీరిపై ఏపీ తమిళనాడు కోర్టులలో కేసులు ఉన్నాయని ఎండి హేమ ఆరోపించారు.

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం…

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్, పూజా కుమార్ లు హీరో హీరోయిన్లుగా నటించిన పిఎస్వి గరుడవేగ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నిర్మాణం కోసం మా వద్ద తీసుకున్న అప్పు ఇప్పటివరకు చెల్లించలేదని జీవిత రాజశేఖర్ దంపతులపై జోస్టర్‌ ఫిలిం సర్వీసెస్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈ విషయం పై జీవిత రాజశేఖర్ దంపతులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago