Featured

Rajashekhar : జీవితం ఇక అయిపోయింది అనుకున్నా.. కూతుళ్లు ఎంతైనా ఎక్కువే.. శేఖర్ లాంటి ఎనర్జెటిక్ పాత్ర మళ్ళీ చేయలేనేమో..!

Rajashekhar : డాక్టర్ రాజశేఖర్, మే 20న శేఖర్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపిన చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తెలుపుతూ రాజశేఖర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇక చిత్రం గురించిన ముచ్చట్లు అలాగే ఇటీవలే కోవిడ్ వల్ల పడ్డ కష్టాలను వివరించారు.

ఇక జీవితం అయిపోయిందనుకున్నా…

ఇక కరోనా సోకినపుడు చాలా రోజులు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చిందని 75 కేజీల బరువు నుండి 62 కేజీలకు వచ్చానని చెప్పారు. ఇక హాస్పిటల్స్ లో బోర్ కొట్టకుండా ఉండటానికి టీవీ ఉండేది అందులో సినిమాలు ఫైట్లు చూసినపుడు ఇలా ఉండాల్సిన నేను ఎలా ఉన్నాను అనుకునేవాడిని, ఇక జీవితం అయిపోయిందని అనిపించింది. అందుకే శేఖర్ సినిమా హక్కులను వేరే వాళ్లకు ఇచ్చేయమని చెప్పాను కానీ జీవితా, పిల్లలు తిరిగి నువ్వు కోలుకుంటావని ధైర్యం చెప్పారు.

ఎంతైనా కూతుళ్లు ఎక్కువే…..

ఇక ఆ కష్టకాలంలో నన్ను చూసుకుంది నా ఇద్దరు కూతుళ్ళే. ఐసీయూలోనే నలుగురు ఉండిపోయాము. కాస్త కదిలిన ఏమి కావాలి నాన్న అంటూ ఇద్దరు వచ్చే వాళ్లు జీవితా కూడా నన్ను బాగా చూసుకుంది. నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు కానీ తాను నేను కోలుకున్నాక చెప్పిన మాట ఒకటే నీ కూతుళ్ళే అన్ని చూసుకున్నారు. గుర్తు పెట్టుకో నా కొడుకులు కూడా నన్ను అంతలా చూసుకోలేదు అన్నాడు. నిజంగా కొడుకులు తక్కువని కాదు కానీ కూతుళ్లు మాత్రం ఎక్కువే అంటూ చెప్పారు.

శేఖర్ లాంటి ఎనర్జెటిక్ సినిమా మళ్ళీ చేయలేను….

మలయాళం రీమేక్ సినిమాగా రాబోతున్న శేఖర్ సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ మేక్ ఓవర్ లో కనిపించాను సినిమా కోసం కష్టపడ్డాను. దర్శకురాలిగా జీవిత ఏమి కావాలో అది రాబట్టుకుంది. ఇక శివాని నా కూతురు కాబట్టి కథలో పాత్ర నిడివి పెంచడం చేయలేదు. అనూప్ సంగీతం బాగుంది. సినిమాకోసమా అప్పులు చేసాము. అందుకే సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితి కష్టమవుతుందనే సినిమాను బతికించండి అనే మాట మనసు నుండి వచ్చేసింది ఈవెంట్ లో అంటూ చెప్పారు. సాయి కుమార్ చాలా రోజుల తరువాత శేఖర్ సినిమా కోసం రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago