Featured

Rakesh master 3rd wife Lakshami : రాకేష్ మాస్టర్ మరణం ముందు జరిగింది ఇదే… ఏడుస్తూ చెప్పిన మూడో భార్య లక్ష్మమ్మ…!

Rakesh master 3rd wife Lakshami : ఎంతో పేరు ప్రఖ్యాతలు తన ప్రతిభతో సంపాదించి తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేసిన రాకేష్ మాస్టర్ జీవితం అందరికీ ఒక గుణపాఠమనే చెప్పాలి. చేతిలో రూపాయి లేకుండా కేవలం తన టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చిన రాకేష్ మాస్టర్ తన డాన్స్ తో అద్భుతాలనే చేసాడు. తాను ఎదగడమే కాకుండా ఎంతో మంది శిష్యులను తయారు చేసి నేడు ఇండస్ట్రీలో తెలుగు డాన్స్ మాస్టర్స్ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటేలా చేసాడు. అలాంటి రాకేష్ మాస్టర్ తన తుది దశలో కేవలం మద్యానికి బానిస అవ్వడం వల్ల తన జీవితం నాశనం చేసుకున్నాడు.

రాకేష్ మాస్టర్ చనిపోక ముందు జరిగింది ఇదే…

రాకేష్ మాస్టర్ గత రెండేళ్లుగా మద్యానికి బానిసగా మారిపోయి నాశనం అయిపోయారు. వంట చేయడానికి అని వచ్చిన మనిషితో సహజీవనం అంటూ యూట్యూబ్ లో వీడియోలను చేసుకుంటూ చివరికి ఆమెతో గొడవ పడి ఆమె కొట్టాడం వల్ల తట్టుకోలేక మానసిక క్షోభ అనుభవించారని ఆయన సన్నిహితులే చెబుతారు. ఇక ఆ మూడో భార్యగా చెప్పబడే లక్ష్మి రాకేష్ మాస్టర్ చివరి చూపుకు రాలేదు.

అయితే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతోంది. రాకేష్ మాస్టర్ కి తనంటే ఎంతో ఇష్టమని, తను మరణిస్తే శవం దగ్గర నువ్వే కూర్చొని ఏడ్వాలి అంటూ చెప్పారని అయితే ఆయన చనిపోయినపుడు నాకు ఆరోగ్యం బాగోలేక రాలేదని చెప్పారు. ఆయన భార్య పిల్లలకు భయపడతారని, నేను ఉన్నన్ని రోజులు బాగా చూసుకున్నానని చెప్పారు. చివరి రోజుల్లో వేరే వాళ్ళతో ఫోన్ చేయించి మాట్లాడారని చెప్పారు. బాగా తాగించి ఆయనను చంపేశారని చెప్పారు లక్ష్మి. తాగి బాగా తిట్టేవాడు, నన్ను హింసించాడు. కానీ ఏ రోజు నేను విడిచి వెళ్లాలని అనుకోలేదు, చాలా మంచి వాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మమల్ని విడదీశారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

Bhargavi

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

4 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

7 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

7 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

7 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

9 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

9 hours ago