Featured

Rakesh master friend Swamy : రాకేష్ మాస్టర్ కి వైజాగ్ సత్యకి మధ్య గొడవ… వాళ్లకి భయపడి ఏం చేసారంటే… మాస్టర్ చనిపోడానికి కారణం అదే…: రాకేష్ మాస్టర్ స్నేహితుడు స్వామి

Rakesh master friend Swamy : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఇక ఆయన మరణం వెనకున్న వాస్తవాలను ఆయన స్నేహితుడు స్వామి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

అనారోగ్యంతోనే మాస్టర్ మృతి…

రాకేష్ మాస్టర్ స్నేహితుడు చివరి రోజుల్లో ఆయనతోనే ఉన్న వ్యక్తి స్వామి. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితూ మాస్టర్ మరణం గురించి ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి, వాటిలో నిజం లేదని తెలిపారు. ఎలాంటి గొడవలు మేము షూటింగులో ఉన్నపుడు జరగలేదని చెప్పారు. ఆయన ఎక్కువగా తాగేవారని, ఆ వేడికి అనారోగ్యం పాడై మరణించారని తెలిపారు. అయితే విజయనగరం షూటింగ్ కి వెళ్లినపుడు ఆరోగ్యాంగానే ఉన్నారంటూ స్వామి తెలిపారు. ‘మ్యాన్షన్ హౌస్ ఇన్ మై హోమ్ విత్ జఫ్ఫా బ్యాచ్’ అనే ప్రోగ్రాం చేయడానికి యూట్యూబ్ లో ఫేమస్ అయిన అగ్గిపెట్టి మచ్చా, స్వాతి నాయుడు, ఇలా చాలా మంది వచ్చారు. ఉప్పల్ బాలు కూడా రావాల్సి ఉండగా వైజాగ్ సత్య రానివ్వలేదు.

మాస్టరే స్వయంగా ఫోన్ చేసినా సత్య ఫోన్లో మాట్లాడలేదు. అపుడు మాస్టర్ బాగా బాధపడ్డారు అంటూ స్వామి తెలిపారు. ఇక ఒక ఫామ్ హౌస్ లో మాకు వసతి కలిపించారు. ఆ రోజు రాత్రి కొంతమంది ఫోటోలు తీసుకుంటాం స్వాతి నాయుడుని పిలవండి అంటే మాస్టర్ పొద్దునే రండి ఈ అర్ధరాత్రి వేల వద్దని చెప్పారు. అప్పుడు కొంచం గొడవ జరగడంతో మరుసటి రోజుకు మాకు అకామిడేషన్ వాళ్లకు భయపడి వేరే చోట నిర్మాతలు ఏర్పాటు చేసారని, పెద్దగా అక్కడ గొడవ జరగలేదని, మాస్టర్ కి షుగర్ ఉన్నా బాగా మామిడి పళ్ళు తినడం అలాగే అక్కడి బూమ్ బూమ్ బీర్ తాగడం వల్లే ఆయనకు బాగోలేకుండా అయిందంటూ చెప్పారు స్వామి.

Bhargavi

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

9 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

9 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

9 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

9 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

10 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

10 hours ago