Rakesh Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మరణ వార్త మర్చిపోకముందే మరొక సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో మరణించారు.
ఈయన వడదెబ్బ కారణంగా తీవ్రమైన విరోచనాలతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరారు. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈయన మరణించారు.ఈ విధంగా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తన శిష్యులు ఇతర కొరియోగ్రాఫర్లు రాకేష్ మాస్టర్ మరణానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
ఇకపోతే రాకేష్ మాస్టర్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలి అనే విషయాలను కూడా తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తనకు చెట్లు అంటే చాలా ఇష్టమని రాకేష్ మాస్టర్ ఈ వీడియోలో తెలియచేశారు. అందుకే తాను చనిపోయిన తర్వాత తనని ఒక వేప చెట్టు కింద సమాధి చేయాలి అంటూ తెలిపారు. తన మామయ్య (భార్య తండ్రి)సమాధి పక్కన ఒక వేప చెట్టు నాటాను తనని కూడా ఆ వేప చెట్టు కిందనే సమాధి చేయాలి అంటూ అలాగే తన అంత్యక్రియలు తన స్నేహితులందరూ కూడా పాల్గొనాలని కొందరి పేర్లను ఈయన సూచించారు.తన అంత్యక్రియల గురించి ముందుగానే రాకేష్ మాస్టర్ చెబుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…