Featured

Ram Charan: ఆ సినిమా ఫ్లాప్ తర్వాత చరణ్ తన సినీ కెరియర్ ముగిసిపోయిందని అనుకున్నారట…!

Ram Charan: మెగా వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే చిరుత వేగంతో ఇండస్ట్రీలోకి దూసుకు వచ్చాడు. ఇలా మొదటి సినిమా మంచి విజయం కావడంతో ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి కెరియర్ మొదట్లోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.

Ram Charan: ఆ సినిమా ఫ్లాప్ తర్వాత చరణ్ తన సినీ కెరియర్ ముగిసిపోయిందని అనుకున్నారట…!

ఇలా మొదటి రెండు సినిమాలతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో తిరుగుండదని భావించారు.ఈ క్రమంలోనే రామ్. చరణ్ తన తరువాత చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా బ్రదర్ నాగబాబు నిర్మాణంలో ఆరెంజ్ సినిమాలో నటించారు.

Ram Charan: ఆ సినిమా ఫ్లాప్ తర్వాత చరణ్ తన సినీ కెరియర్ ముగిసిపోయిందని అనుకున్నారట…!

మగధీర వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. కేవలం ఒక వారంలోపే థియేటర్ల నుంచి ఈ సినిమాను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఉన్నఫలంగా తన కెరీర్లో పెద్ద డిజాస్టర్ రావడంతో చరణ్ ఎంతో డిస్టర్బ్ అయ్యారని ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

జీవితంలో ఆ సంఘటనకు మర్చిపోలేను…


ఈ విధంగా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు కష్టాలు వచ్చాయని అయితే ఈ సినిమా తరువాత తనతో సినిమాలు చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో తన కెరీర్ ముగిసిపోయిందని రామ్ చరణ్ భావించినట్లు తెలిపారు. ఇలా సినిమా అవకాశాలు రాని సమయంలో తన దగ్గరకు నాతో సినిమా చేయడానికి చౌదరి ముందుకు వచ్చారని నా జీవితంలో ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేని రామ్ చరణ్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago