Featured

Ram Gopal Varma : ఊర్మిళ లేకపోతే రంగీలా సినిమా ఉండేది కాదు… ఆంతం సినిమా కథను మార్చి సత్య తీసాను…: ఆర్జీవి

Ram Gopal Varma : వివాదాలతో బ్రతికేస్తున్న ఆర్జీవి ఒకప్పుడు మాత్రం మంచి సినిమాలను తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పటికి అర్జీవీ ఒకప్పటి సినిమాలను చూస్తే ఆ టేకింగ్ మరెవరికీ రాదు అనేంతలా ఆ సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్జీవి తీస్తున్న సినిమాలు ఎపుడు వస్తున్నాయో ఎపుడు పోతున్నాయో తెలియదు. అయితే ఒకప్పటి ఆర్జీవి సినిమాల గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమాలను ఎలా ప్లాన్ చేసుకున్నారు, కథ ఎలా అనుకున్నారు లాంటి విషయాలను పంచుకున్నారు. వర్మ కెరీర్లో శివ, రంగీలా, తరువాత సత్య సినిమా ను చెప్పొచ్చు, అలాంటి సత్య సినిమాను తక్కువ బడ్జెట్ లో అద్భుతంగా తీసిన వర్మ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు.

అంతం సినిమా కథే సత్య… ఊర్మిళ లేకపోతే రంగీలా లేదు…

సత్య సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్నీ డిటైల్డ్ గా తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంటున్న వర్మ ఆ సినిమా కథను ‘అంతం’ సినిమాను కొంచెం చేంజ్ చేసి తీసానంటూ చెప్పారు. అంతం సినిమా హిట్ అయ్యుంటే సత్య సినిమా వచ్చేది కాదంటూ చెప్పారు. అంతంలో ఎలా ఉంటుందో స్టోరీ అదే సత్య కు తీసుకున్నాను, కొన్ని చుట్టూ ఉన్న పాత్రలను మాత్రం మార్చాను అంటూ చెప్పారు.

అయితే అంతం సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమా వల్ల బాలీవుడ్ లో సత్య తీయగలిగాను అలానే ఆ సినిమాలో చెసిన ఊర్మిళ ‘గాయం’లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ సమయంలో ఒక డాన్స్ తనది చూసి రంగీలా సినిమా ప్లాన్ చెసుకున్నాను. ఇలా అంతం సినిమా నాకు ఎంతగానో ఉపయోగపడింది. అంతం సినిమా వల్ల సత్య సినిమా వచ్చింది. అలాగే ఊర్మిళ దొరికి రంగీలా సినిమా తీసాను. ఊర్మిళ లేకపోతే రంగీలా సినిమా లేదు అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

20 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago