Featured

Ram Gopal Varma : శ్రీదేవిని వద్దని రమ్యకృష్ణను పెట్టుకోవడం రాజమౌళి గొప్పతనం.. ఇక్కడ ఎవరి చావు వాడే చావాలి : రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఇండస్తీ కి సంబంధించిన ఇష్యూల గురించి తనదైన శైలిలో మాట్లాడుతాడు ఆర్జీవి. రీసెంట్ గా తెలుగు సినిమా రంగం లో హాట్ న్యూస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి నిర్మాతలు నష్టపోతున్నారని నిర్మాతల గిల్డ్ చేసిన సినిమా షూటింగుల బంద్ వివాదం. అయితే ఈ విషయంలో ఎవరికి వారు వారికి నచ్చినట్టు స్పందించారు. అయితే ఇపుడు వివాదాల జీవి ఆర్జీవి ఎవరి చావు వాళ్ళు చావాలి అంటూ కామెంట్స్ చేసాడు.

శ్రీదేవి కి నో చెప్పి రమ్యకృష్ణ ను తీసుకోవడం రాజమౌళి గొప్పతనం…

ప్రొడక్షన్ కాస్ట్ అనేది నిర్మాతల చేతుల్లో ఉండాలి. అంతే కానీ చేయి దాటి పోయాక బాధ పడితే ఏం లాభం. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో ఎంత ఖర్చు పెట్టకూడదో ఒక లిమిట్ ఉండాలి. ఇపుడు రాజమౌళి బాహుబలి సినిమా కోసం శ్రీదేవి ని అడిగినపుడు ఆమె ఎన్ని సూట్స్ హోటల్ లో కావాలి, హిందీ రైట్స్ కావాలి అని డిమాండ్ చేయడంతో శ్రీదేవి ని వద్దనుకుని రాజమౌళి రమ్యకృష్ణ ను ఆ సినిమా కోసం తీసుకున్నాడు. ఎందుకంటే అంత బడ్జెట్ ఆమె మీద పెట్టడం కరెక్ట్ కాదని తానే నిర్ణయం తీసుకున్నాడు. అది అతని సినిమా మీద అతనికి ఉన్న నమ్మకం. శ్రీదేవి లేకపోయినా సినిమాను హిట్ చేసుకోగలనని నమ్మకం ఉంది. కానీ చాలా మంది మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులను పెట్టి సినిమా తీయాలి అనుకున్నపుడు డిమాండ్ బట్టి రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇవ్వను అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే వారితో సినిమాలు చేస్తారు. ఒక డైరెక్టర్, లేదా హీరో అని కాదు సినిమా లో ఎవరిని చూసి జనం థియేటర్ కి వస్తున్నారు అన్నదే ఇంపార్టెంట్. అతనికి మాత్రమే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే హక్కు ఉంటుంది.

కానీ ఒక నిర్మాత హీరోని రెమ్యూనరేషన్ తగ్గించుకోమని అడిగే హక్కు లేదు, కానీ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుందని చెప్పచు. కానీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలని సినిమాను రాజీ పడి తీయలేని పరిస్థితి రాజమౌళి సినిమాల వల్ల థియేటర్ కి జనం రావాలంటే ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువ ఉండాలి అని అనుకుంటున్నారు. అలా సినిమా ప్రొడక్షన్ వాల్యూ కి రాజీ పడకూడదు అంటే అపుడు బడ్జెట్ గురించి ఆలోచించకూడదు. ఇవి రెండు భిన్న ధృవాలు, కాబట్టి ఇలాంటి సమస్యలకు పరిష్కారం, కారణాలు కనిపించవు ఎవడి చావు వాడు చావాల్సిందే. విజయానికి ఎలాగైతే ఒక ఫార్ములా ఉండదో అలానే సినిమా నిర్మాణ వ్యయం వంటి విషయాల్లో కూడా ఫార్ములా ఏం ఉండదు. వీళ్ళు ఉంటే సినిమా హిట్ అవుతుంది ఇంత బడ్జెట్ పెడితే సినిమా ఆడుతుంది అనుకోవడం తప్పు అంటూ కామెంట్స్ చేసారు ఆర్జీవి.

Bhargavi

Recent Posts

వేసవిలో తేనె తినాలా? తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలు!

వేసవి కాలంలో శరీరంలో వేడి పెరగడం సహజం. అందుకే ఈ సీజన్‌లో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు…

11 minutes ago

శ్మశానంలో పెండ్లి.. జంటకు షాక్.. విచారణ మొదలు

ఉత్తరాఖండ్‌లో జరిగిన ఒక విచిత్ర వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సంప్రదాయాలకు విరుద్ధంగా, ఒక జంట శ్మశాన వాటికలో…

18 minutes ago

చల్లగా ఉందని తాగేస్తున్నారా? చెరకు రసం అందరికీ మంచిదేనా? కొందరికి మాత్రం ప్రమాదమే!

వేసవి కాలం మొదలైతే చల్లని పానీయాల వైపు అందరూ మొగ్గు చూపుతారు. ముఖ్యంగా చెరకు రసం, కొబ్బరి నీరు వంటి…

20 minutes ago

రోజూ పప్పు తింటే గుండె జబ్బులు దూరం అవుతాయా?

నేటి జీవనశైలిలో గుండె జబ్బులు, క్యాన్సర్‌, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

31 minutes ago

ఎద్దు బాధపై రష్మి ఆగ్రహం.. కఠిన చర్యల డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత అంశంపై జరిగిన నిరసన కార్యక్రమం ఇప్పుడు అనూహ్యంగా జంతు హింస వివాదానికి దారితీసింది. తిరుపతిలో వైసీపీ…

33 minutes ago

ఆధార్‌లో కులం చూసి హీరో ఛాన్స్ క్యాన్సిల్.. షాకింగ్ రివీల్

టాలీవుడ్‌లో అవకాశాల కోసం పోరాడుతున్న కొత్త నటుల కథల్లో కొన్నిసార్లు చేదు నిజాలు బయటపడుతుంటాయి. అలాంటి అనుభవాన్నే తాజాగా నటుడు…

36 minutes ago