Featured

Chandra Mahesh : బ్రహ్మానందం కొడుకు కోసం కథ రెడీ చేస్తున్నపుడు ఏం జరిగిందంటే.. వేణు తోట్టెంపూడి, తరుణ్ ఇగో క్లాషెస్ వల్ల సినిమాలు ఆగిపోయాయి : చంద్ర మహేష్

Chandhra Mahesh : తెలుగులో ఎంతోమంది కెరీర్ వెతుక్కుంటూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సినిమా ఇండస్ట్రీ లోకి వస్తారు. అలా వచ్చిన వ్యక్తే చంద్ర మహేష్. తూర్పు గోదావరి జిల్లా కు చెందిన చంద్ర మహేష్, సురేష్ ప్రొడక్షన్ హౌస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ‘ధర్మచక్రం’ వంటి సినిమాకు పనిచేసిన చంద్ర మహేష్ ఆ తరువాత 1999 లో శ్రీకాంత్ తో తీరిన ‘ప్రేయసి రావే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత శ్రీహరి గారితో ఒక్కడే, అయోధ్య రామయ్య చెప్పాలని ఉంది వంటి సినిమాలతో హిట్ కొట్టాడు.

వేణు, తరుణ్ ల ఇగో వల్ల సినిమా ఆగిపోయింది…

చంద్ర మహేష్ మొదటి నుండి సురేష్ ప్రొడక్షన్ లోనే సినిమా చేయాలని భావించి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడే సురేష్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఇక ప్రేయసి రావే సినిమా హిట్ తరువాత గుర్తింపు తెచ్చుకున్న చంద్ర మహేష్ అయోధ్య రామయ్య సినిమా తరువాత ఆకుల శివ ఒక కథను సిద్ధం చేయగా సురేష్ ప్రొడక్షన్ లో సినిమా ప్లాన్ చేసారు. అయితే మొదట హీరోగా తరుణ్ ని అనుకొంటే నువ్వే కావలి సినిమా హిట్ తో బిజీ అయిన తరుణ్ కి ప్రొడ్యూసర్ తో ఇగో క్లాషెస్ వల్ల సినిమా ముందుకు సాగలేదు. ఇక కథ కొంచెం మార్చి వేణు తోట్టెంపూడి తో సినిమా చేయాలని అనుకుంటే చిరునవ్వుతో సినిమా హిట్ వల్ల ఆయనకు ప్రొడ్యూసర్, ఇతర ఇగో క్లాషెస్ వల్ల చేయలేదు. ఇక స్టోరీ మార్చి వడ్డే నవీన్ గారికి కథ చెప్పితే ఆయన ఓకే చేసారు. అలా చెప్పాలని ఉంది సినిమా చేసాము అంటూ అప్పటీ సంగతిలను చెప్పారు.

బ్రహ్మానందం కొడుకు సినిమా అలా ఆగిపోయింది…

చంద్ర మహేష్, రైటర్ అశోక్ కుమార్ కాంబినేషన్ లో బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా ఒక సినిమా అనుకున్నాక ఆ సినిమా చేయలేదు. కథను అశోక్ కుమార్ సిద్ధం చేసాక ఆ కథను తన స్నేహితులు నలుగురితో చంద్ర మహేష్ గారు చర్చించినపుడు కథకు మార్పులు సూచిస్తారని అనుకుంటే చివరికి కథ కంచికి పోయిందని సినిమా చేయలేక పోయానని చంద్ర మహేష్ చెప్పారు. ఇక కొన్ని రోజులయ్యాక అశోక్ కుమార్ కనిపించి నా కథను అందరితో చర్చించి ఎన్ని ముక్కలు చేశారో చూడండి అన్నాడట. ఆ సినిమాలో ఒక ముక్క రెడీ సినిమా, ఒక ముక్క పరుగు సినిమా అలా వచ్చాయని అశోక్ చెప్పినపుడు సేమ్ కాన్సెప్ట్ ఐడియా వారికి వచ్చుండొచ్చు వదిలేయ్ అని చెప్పానని చంద్ర మహేష్ చెప్పాడు. అలా గౌతమ్ తో సినిమా ఆగిపోయింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago