Featured

Kalyan Ram : నందమూరి ఇంట్లోకి మెగాస్టార్ బిరుదు.. మెగా నందమూరి మధ్య వార్ కోసం ఇలా చేశారా..!

Kalyan Ram : నందమూరి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో ఆ తరువాత సొంత బ్యానర్ పెట్టి ‘అతనోక్కడే’ సినిమాచేసి కమర్షియల్ హిట్ కొట్టాడు. అలాగే ఇండస్ట్రీ కి ఒక కొత్త డైరెక్టర్ ను పరిచయం చేసాడు. ఇక ఆ సినిమా తరువాత ఎన్నో ఒడిదుడుకులను కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో చూసాడు. ఇక పటాస్, 118 వంటి మంచి విజయాలు ఉన్న కళ్యాణరామ్ సొంత బ్యానర్లో నే సినిమాలను నిర్మించారు. అలాగే కొత్త దర్శకులను టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.

మెగాస్టార్ అంటూ కొత్త బిరుదులు…

తాజాగా దర్శకుడు వశిష్ఠ ను పరిచయం చేస్తూ ‘బింబిసార’ సినిమా తీసాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో వెళుతోంది. అయితే సోషల్ మీడియాలో నిన్న ట్రెండ్ అయిన ఒక విషయం మాత్రం మెగా, నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికి అన్నట్లు గా ఉంది. అదే కళ్యాణ్ రామ్ ని మెగాస్టార్ అనడం. ఎంత మంది మంచి ఆర్టిస్టులు వచ్చినా మెగాస్టార్ స్థానం చిరుదే. ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా అదే సమాధానం చెబుతారు. ఇక ఇటీవల బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడటం శుభపరిణామం అనుకున్నాము.

ఇక తారక్, చెర్రీ ల మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పనవసరం లేదు. అలాంటిది ఇప్పుడు ఆ రెండు కుటుంబాల మధ్య, అభిమానుల మధ్య చిచ్చు పెట్టడనికే అన్నట్టు కళ్యాణ్ రామ్ కి మెగా స్టార్ అనే బిరుదు ఇచ్చి ట్రెండ్ చేసారు. ఇప్పడిప్పుడే అభిమానులంతా ఒకటిగా ఉండటానికి ట్రై చేస్తుంటే మళ్ళీ ఇదేంటి అని కొందరు భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటన బాగుంది, సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది అంత మాత్రాన మెగాస్టార్ అనడం ఎంతవరకు సబబు. సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా మెగాస్టార్ స్థానం మెగాస్టార్ దే…

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago