బాలీవుడ్ ధోనీ సుశాంత్ మరణం సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే..! అయితే తాజాగా బాలీవుడ్ పరిస్థితులపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియాలోని కొందరు ప్రతినిధులతో మాట్లాడుతూ.. “నెపోటిజం అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. ఆది ఒక్క సినిమా రంగంలోనే లేదు. కనుక అలా కామెంట్స్ క్రియేట్ చేసేవాళ్ళందరూ పని, పాటా లేక కేవలం పబ్లిసిటీ కోసం చేసే దుష్పచారం” అంటూ వర్మ సంచలనమైన కామెంట్లే చేశారు. ఇంతకీ ఆయన నెపోటిజం గురించి ఏం చెప్పారనేకదా మీ సందేహాం..
“బంధుప్రీతితో స్వయంప్రతిభను ఆణగ తొక్కేస్తున్నారనే అర్ధంలేని ఆరోపణలకు నేను పూర్తిగా వ్యతిరేకిని. ప్రతీ ఇంట్లోనూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ప్రోత్సహించుకోవడమనేది నేటి నుండి జరుగుతున్న వ్యవహారం కాదు. అన్ని రంగాలలోనూ అనాది నుండి కొనసాగుతూనే వున్న ఆచారమిది. అంతెందుకు.. లోకేష్‌కు చంద్రబాబు, వైఎస్ జగన్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని ఇచ్చారు. అందులో తప్పేమీ నాకు కనబడలేదు. ఎవరి ఛాయిస్ ప్రకారం.. వారికి ఉన్న ఫాలోయింగ్‌కు తగ్గట్టుగా ఇలాంటి నిర్ణయాలు జరుగుతూ వుంటాయి. ఈ మాత్రం దానికే నెపోటిజమని పేరు పెట్టి సోషల్ మీడియాలో సుశాంత్ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు అని వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఉదాహరణలు చెబుతూ..
చిరంజీవి తన కొడుకు రాంచరణ్‌ను టాలీవుడ్ కు పరిచయం చేయడంలో తప్పేంటి? తన కొడుకుని కాకపోతే వేరేవాళ్ళను పరిచయం చేస్తాడా? నెపోటిజం అనేది పనిలేని వాళ్లు చేసే పనికిమాలిన కామెంట్స్.. సినిమా రంగంలోని అగ్ర హీరోల కొడుకులు, కూతుళ్ళు నిజంగానే సక్సెస్ అవుతున్నారా? ఫెయిల్ అవుతున్నారా.? అన్నది వాళ్ల వ్యక్తిగతమని రాంగోపాల్ వర్మ ఈ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండబ్రద్థలు కొట్టినట్టు తెలియజేయడం విశేషం. ఇక ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో జరిగిన సుశాంత్ మరణం వివాదంలో తప్పు ఎవరిదనేది పక్కన పెడితే.. యంగ్ హీరో సుశాంత్ ఎఫ్పుడూ ఫెయిల్యూర్ హీరో కాదు. ఆయనను ఫ్లాప్ హీరోగా లెక్కించ కూడదు. బాలీవుడ్ లో టాప్ 15 స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్నా సరే తాను ఫెయిల్యూర్ అనే విషయాన్ని సుశాంత్ నిర్ణయించుకున్నారా.? లేదా.? అనే విషయమే కీలకమని వర్మ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…