Movie News

Ram Gopal Varma: “రేపు ఇలాంటి దుస్థితి మీకు రాక మానదు.. ఇలా చేయడానికి సిగ్గుండాలి” షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే కృష్ణంరాజు ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా టాలీవుడ్ సెలబ్రిటీలు కృష్ణంరాజు మరణం తర్వాత ఆయనను సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువరు కూడా సెలబ్రిటీలపై కామెంట్లు చేస్తూ వివాదానికి తెర లేపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సీనియర్ హీరోలు కృష్ణంరాజు మృతి చెందినప్పటికీ ఆయనకు నివాళులు అర్పించి అనంతరం తమ సినిమా షూటింగులతో బిజీ అయ్యారు.

ఈ క్రమంలోనే వర్మ తనదైన శైలిలో ఈ విషయంపై కామెంట్ చేస్తూ.. లెజెండరీ నటుడు కృష్ణంరాజు చనిపోతే ఆయనకు నివాళిగా సినిమా షూటింగ్ లు ఆపకపోవడంపై ఈయన మండిపడ్డారు. ఆ మహానటుడి కోసం ఒక్క రోజు కూడా సినిమా షూటింగులు ఆపలేని స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు అంటూ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma: ఎంతో సిగ్గుచేటు…

రేపు పొద్దున ప్రతి ఒక్కరికి ఇలాంటి దుస్థితి రాకమానదు.ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇలా వర్మ టాలీవుడ్ సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా మరి కొంతమంది ఇలాంటి సమయంలో ఇలాంటి ట్వీట్ చేస్తూ అందరినీ గెలవడం అవసరమా అంటు కామెంట్లు పెడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago