Featured

Ram Lakshman : రాజమౌళి మొదటి సినిమా మాతోనే చేయాలనుకుంటే ఎన్టీఆర్ తీయించారు.. పాన్ ఇండియా సినిమాలపై ఆలోచన లేదు..!

Ram Lakshman : ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఇద్దరూ తెలుగులో తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుని చాలా సినిమాలకు యాక్షన్ సన్నివేశాలను చేసారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు సోదరులు కవలలు. సినిమాలలో యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేసినందుకు పలు చిత్రాలకు నంది అవార్డులను అందుకున్నారు. ఇప్పటివరకు ఫైట్ మాస్టర్లుగా ఆరు నందులను అందుకున్నారు. ఆర్య, ఆంధ్రుడు, ఢీ, నేనింతే, రైడ్, లెజెండ్ సినిమాలకు నందులను అందుకున్నారు. విజయన్ లాంటి ఫేమస్ ఫైట్ మాస్టర్ ఉన్న సమయంలో వీరు ఇండస్ట్రీ లో అడుగుపెట్టి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

రాజమౌళి ఆఫర్ ఇస్తే ఎన్టీఆర్ తీయించాడు….

ఇక అవకాశాల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు ఈ ఇద్దరు సోదరులు. మొదట్లో శ్రీహరి సినిమాలకు ఎక్కువగా విజయన్ మాస్టర్ ఫైట్స్ కంపోజ్ చేసే వారని పెద్ద హీరోలకు బిజీ అయ్యాక ఆయన స్థానాన్ని తాము భర్తీ చేసినట్లు చెప్పారు. చాలా సార్లు మాకు రావాల్సిన అవకాశాలు వేరేవాళ్లకి పోతాయని, కొన్నిసార్లు వారు చేయాల్సిన ప్రాజెక్టులు మాకు వస్తాయని ఇదంతా ఇండస్ట్రీ లో మాములే అని చెప్పారు. మొదట్లో అవకాశాలు పోయినపుడు కొంచెం బాధ అనిపించినా ఇపుడు యోగా, ధ్యానం చేయడం వల్ల అటువంటి ఆలోచనలు లేవని చెప్పారు. రాజమౌళి గారి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 లో రాజమౌళి గారే స్వయంగా ఫోన్ చేసి నా మొదటి సినిమాలో మీరే ఫైట్ మాస్టర్ గా ఉండాలని చెప్పి పిలిపించి, కథ చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చారని, కానీ చివర్లో ఎన్టీఆర్ పీటర్ హైన్స్ ని రికమెండ్ చేయడంతో రాజమౌళి మమ్మల్ని తీసేసారని, ఆ తరువాత ఆయన తో విక్రమార్కుడు, మగధీర వంటి చిత్రాల్లో చేశామని చెప్పారు.

ఇక పాన్ ఇండియా సినిమాలలో భాగం కాలేనందుకు ఎం అనిపించలేదా అని అడిగినపుడు అలాంటిదేమి లేదని ఒక పాన్ ఇండియా సినిమాకోసం మిగిలిన సినిమాలను వదులుకోలేమని, ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో రామ చరణ్ యాక్షన్ సీన్ చేయాల్సి ఉండి 45 రోజులు వర్క్ చేసాక రామ్ చరణ్ కి దెబ్బ తగిలి వాయిదా పడగా ఆ తరువాత డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ సినిమా ను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు డేట్లు కేటాయించలేనపుడు వదులుకోవాల్సి వస్తుందని దానివల్ల మిగిలిన సినిమాలు కూడా డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పారు. రవితేజతో చాలా సినిమాలు చేసి చేంజ్ కోసం మధ్యలో తామే బ్రేక్ తీసుకున్నామని దానివల్ల ఒకే బాడీలాంగ్వేజ్ అలవాటు కాదని అందుకే అలా చేశామని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago